iDreamPost

వీడియో: కార్లు పగలగొట్టింది తన ఫ్యాన్స్ కాదంటున్న పల్లవి ప్రశాంత్!

Pallavi Prashanth First Reactin On Fans Issue: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు ఫ్యాన్స్ హంగామా మీద స్పందించాడు. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడంపై రియాక్ట్ అయ్యాడు.

Pallavi Prashanth First Reactin On Fans Issue: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు ఫ్యాన్స్ హంగామా మీద స్పందించాడు. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేయడంపై రియాక్ట్ అయ్యాడు.

వీడియో: కార్లు పగలగొట్టింది తన ఫ్యాన్స్ కాదంటున్న పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతోంది. టైటిల్ గెలిచాడని మాత్రమే కాకుండా.. అతనిపై నమోదైన కేసుల విషయంలో కూడా పేరు బాగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అతని ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు. గీతూ రాయల్, అశ్వినీ శ్రీ, అమర్ దీప్ కార్లను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాన్ని పగలగొట్టారు. అయితే ఈ ఘటనలపై మొదటిసారి ప్రశాంత్ స్పందించాడు. అలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉద్దేశించి ప్రశాంత్ కామెంట్ చేశాడు.

బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ మాట, తీరు మొత్తం మారిపోయిందని మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్వ్యూ ఇస్తానని ఊరికి పిలిచి.. ఆఖరికి ఇంటర్వ్యూ లేదు ఏం లేదు దెం***మను అన్నాడని విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రశాంత్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. అతని ఫ్యాన్స్ పేరిట బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా తాను గెలిచిన రూ.35 లక్షలు రైతులకు ఇస్తానని స్టేజ్ మీద చెప్పాడు. కానీ, బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీ ఊరు దగ్గర 14 ఊర్ల రైతులు నష్టపోయారు కదా.. వారికి సాయం చేస్తావా అంటే నన్ను సీఎం చేయుర్రి 14 ఊర్లను కాపాడతాను అంటూ కామెంట్స్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కు నెట్టింట తీవ్ర విమర్శలు, నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. అయితే ఈ విషయాలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ స్పందించాడు.

తనని వెనుక గేట్ నుంచి పంపేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నేనేమీ దొంగతనం చేయలేదు. నన్ను గెలిపించిన వాళ్లు అంతా అక్కడ ఉంటే వారిని కలవకుండా ఎందుకు పోవాలి అనుకున్నాను. అందుకే మళ్లీ తిరిగి స్టూడియో దగ్గరకు వెళ్లానని చెప్పాడు. కారులో నుంచి ట్రోఫీ తీసి గెలిపించిన వారికి చూపించానన్నాడు. అంతేకాకుండా సాయం గురించి కూడా స్పందించాడు. తాను చెప్పిన విధంగా రూ.35 లక్షలు కచ్చితంగా రైతులకు ఖర్చు పెడతానన్నాడు. ఆ 14 ఊర్లకు ఈ రూ.35 లక్షలు ఏ విధంగానూ సరిపోవంటూ వ్యాఖ్యానించాడు. తాను చేయబోయే సాయం గురించి కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానన్నాడు. అంతేకాకుండా ఈ ఫ్యాన్స్ గొడవ గురించి మాట్లాడుతూ.. “అమర్ అన్న నేను ఎట్లుంటమో నాకు తెలుసు. ఆయన నామినేషన్ ఏసినప్పుడు నేను ఏడ్చాను. ఆయన నా అన్న లెక్క అనుకున్నాను. ఆయన నామినేట్ చేయగానే బాధపడ్డాను. అమర్ అన్న గేమ్ విషయానికి వస్తే.. అక్కడ ఏం మాట్లాడుకున్నా అక్కడే మర్చిపోతాం. నేను అన్నకు అన్నం కలిపి పెట్టాను. ఆయన నీళ్లు నేను నా నీళ్లు ఆయన తాగినం.

ఓరోజు మా ఊరికి రారా.. అమ్మ మటన్ బాగా చేస్తుందని చెప్పాడు. మా ఊరికి కూడా రావాలని అడిగాను. తప్పకుండా వస్తాను. నాకు ట్రాక్టర్ నడుపడం అంటే ఇష్టం. ఒక వీడియో కూడా తీయాలి అన్నాడు. అన్నా రా అన్నా దానిలో ఏముంది అని చెప్పాను. ఇంత మంచిగా ఉన్న మేము ఎందుకు అలా చేస్తాం. మీరు ఒకటి గమనించాలి. నా ఫ్యాన్స్ అని చెబుతున్నారు. నా ఫ్యాన్స్ అయితే గీతూ అక్క, అశ్వినీ కార్లను ఎందుకు పగలగొడతారు. వాళ్లు నాతో బాగానే ఉన్నారు కదా? ఆర్టీసీ బస్సు పగలగొట్టారు అంట.. నా ఫ్యాన్స్ అస్సలు అలా చేయరు. షో తర్వాత కూడా అమర్ అన్నతో.. అన్న నీ విషయంలో ఏమైనా తప్పు జరిగుంటే సారీ అన్న అని చెప్పాను” అంటూ పల్లవి ప్రశాత్ చెప్పుకొచ్చాడు. మరి.. దాడి చేసింది తన ఫ్యాన్స్ కాదంటూ ప్రశాంత్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి