iDreamPost

అన్ని సీజన్స్​ను మించి Bigg Boss 7.. హింట్ ఇచ్చిన నాగార్జున!

  • Author singhj Updated - 05:39 PM, Sat - 12 August 23
  • Author singhj Updated - 05:39 PM, Sat - 12 August 23
అన్ని సీజన్స్​ను మించి Bigg Boss 7.. హింట్ ఇచ్చిన నాగార్జున!

తెలుగు టెలివిజన్ షోల్లో బిగ్​బాస్​కు ఉన్న ఆదరణ గురించి తెలిసిందే. ఈ రియాలిటీ షోను చాలా మంది ఆడియెన్స్ ఇష్టపడతారు. అలాంటి బిగ్​బాస్ సీజన్ 7 త్వరలో షురూ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి కన్ను ఈ షో మీదే పడింది. ఈసారి కంటెస్టెంట్లుగా ఎవరెవరు వస్తారు? గత సీజన్లను మించి ఈసారి షోను ప్లాన్ చేస్తున్నారా? లాంటి ప్రశ్నలు అందరికీ తొలచి వేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం బిగ్​బాస్​ను మరింత పకడ్బందీగా, జాగ్రత్తగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రూల్స్​ను కూడా రెడీ చేసేశారని టాక్.

తెలుగు బిగ్​బాస్​ షో ఇప్పటివరకు ఆరు సీజన్లను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. లాస్ట్ సీజన్​లో సింగర్ రేవంత్ విన్నర్​గా నిలిచాడు. అయితే గత సీజన్ ఆశించినంతగా ఫలితం రాబట్టకపోవడంతో ఈసారి బిగ్​బాస్ ఎలా ఉండోబోతోందనేది హాట్​ టాపిక్​గా మారింది. ఇప్పటికే రిలీజైన టైటిల్ ప్రోమో మాత్రం ఈసారి సీజన్ బాగుంటుందనే ధీమాను ఇస్తోంది. కింగ్ నాగార్జుననే హోస్ట్ అని కన్ఫర్మ్ చేస్తూ వదిలిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోలో సరికొత్త లుక్​లో దర్శనమిచ్చిన నాగ్.. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..’ అంటూ ముగించారు. దీంతో అసలు ఈ లైన్​కు అర్థమేంటి? ఆయన ఏ విషయాన్ని చెప్పారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో అసలు సీక్రెట్ రివీల్ చేశారు నాగ్.

బిగ్​బాస్ షైనింగ్ స్టార్స్ అనే ఈవెంట్​లో పాల్గొన్న నాగార్జున.. బిగ్​బాస్​ 7 టీజర్ రహస్యాన్ని చెప్పేశారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నారు కదా. దాని అర్థమేంటి’ అని నాగ్​ను యాంకర్ సుమ అడిగారు. దీంతో ఓపెన్ అయిన నాగార్జున.. ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్’ అని జవాబిచ్చారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. ఈసారి షోలో చాలానే మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. గత ఆరు సీజన్లతో పోలిస్తే బిగ్​బాస్ 7 నెక్స్ట్ లెవల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి.. బిగ్​బాస్ సీజన్ 7 మిగతా అన్ని సీజన్లను మించిన స్థాయిలో ఉంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి