iDreamPost

బిగ్ బాస్ పర్వంలో నామినేషన్ల ఘట్టం

బిగ్ బాస్  పర్వంలో  నామినేషన్ల ఘట్టం

మొన్న గంగవ్వ, జోర్దార్ సుజాతాలను డబుల్ ఎలిమినేషన్ చేశాక నిన్న ఎపిసోడ్ నుంచి ఫ్రెష్ గా నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రాను రాను ఈ తతంగం రొటీన్ గా మారిపోతోంది. సాధ్యమైనంత ఎంటర్ టైన్మెంట్ ఉండేలా నిర్వాహకులతో పాటు పార్టిసిపెంట్స్ కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. నిన్నటి సంగతి చూస్తే ఎవరికి వారు గట్టిగానే తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకున్నారు. అరియనా తనకిచ్చిన ఛాన్స్ లో మోనాల్, మెహబూబ్ లను నామినేట్ చేసింది. ఆ ఇద్దరి ప్రవర్తన పట్ల తనకున్న అభ్యంతరాలను ఈ విధంగా తీర్చేసుకుంది. దివి కూడా జాయింట్ గా నోయెల్, మెహబూబ్ లను బయటికి పంపేందుకు ఎంచుకుంది.

నోయెల్ తనతో ప్రవర్తించిన తీరు ఇంకా మర్చిపోలేదు కాబోలు. నోయెల్ విషయానికి వస్తే దివి, అభిజిత్ లను ఫిక్స్ చేశాడు. అయితే అభిజిత్ అంత సులభంగా బయటికి వెళ్లే రకం కాదని ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. హారిక నేరుగా అరియనాను నామినేట్ చేసింది. హోటల్ టాస్క్ లో జరిగిన పరిణామాల ప్రభావం కాబోలు. తనతో పాటు కుమార్ సాయిని కూడా చేర్చేసింది. బూతులు వాడినందుకు మెహబూబ్ ని అభిజిత్, గొడవ పడినందుకు అఖిల్ ని జంటగా నామినేట్ చేశాడు అభిజిత్. లాస్య విషయానికి వస్తే తను కూడా మెహబూబ్, దివిలనే ఎంచుకుంది. వాళ్ళ మధ్య జరిగిన శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఇక అందరి కన్నూ తన మీద పడేలా వేసుకున్న మెహబూబ్ తన వంతులో దివి, అరియనాలను నామినేట్ చేశాడు.

సోహైల్ టర్న్ లో అరియనా, కుమార్ సాయిలు లిస్ట్ అయ్యారు. అమ్మ రాజశేఖర్ తన ఛాన్స్ ని వాడుకుని లాస్య, అభిజిత్ లను చెప్పాడు. అవినాష్ దివి-అభిజిత్ ల పేర్లు చెప్పగా మోనాల్ అరియనా-దివిలను ఎంచుకుంది. అఖిల్ అభిజిత్-అరియనాలను నామినేట్ చేశాడు. కుమార్ సాయి తన అవకాశంలో హారిక-మోనాల్ ల నేమ్స్ చెప్పేశాడు. సోహైల్ తనకు వచ్చిన ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకుని మెహబూబ్ ని కాపాడేందుకు ప్రాధ్యానత ఇచ్చాడు. అందరూ వద్దనుకున్న మెహబూబ్ తన వల్ల వచ్చే వారం సేవ్ అయ్యాడు. ఫైనల్ గా అభిజిత్, దివి, మోనాల్, లాస్య, అరియనా, కుమార్ సాయి, నోయెల్, అఖిల్, హారికలు నామినేషన్ లిస్ట్ లో మిగిలారు. మరి ఈ వీకెండ్ లో ఎవరు బయటికి వస్తారో ఈ నాలుగు రోజులు జరగబోయే టాస్కుల మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికి నామినేషన్ల ప్రహసనంతో బిగ్ బాస్ ఫ్రెష్ వీక్ చప్పగానే మొదలయ్యింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి