iDreamPost

ఒకరిని మించి ఒకరు – వేడెక్కిస్తున్న నామినేషన్లు

ఒకరిని మించి ఒకరు – వేడెక్కిస్తున్న నామినేషన్లు

గత వారం హౌస్ నుంచి బయటికి ఎవరూ వెళ్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్న బిగ్ బాస్ 4 పార్టిసిపెంట్స్ ఫినాలేకు టైం దగ్గర కావడంతో తమలోని పరిపూర్ణ నటీనటులను బయటికి తీసుకొస్తున్నారు. ఎవిక్షన్ పాస్ ద్వారా సేఫ్ అయిన అవినాష్ జరిగిన దానికి సంతోషపడకుండా అవసరానికి మించిన పెర్ఫార్మన్స్ ఇస్తూ లేని సానుభూతి కోసం తెగ ట్రయ్ చేశాడు. సోహైల్, అరియనాల మధ్య ముద్దుల ఎక్స్ చేంజ్ కొనసాగింది. పరస్పరం ఓదార్పు చేసుకుని ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఖిల్, సోహైల్, అవినాష్ లు అడిగి మరీ నిద్రపోయినా నామినేషన్లకు వేళ అయ్యిందంటూ బిగ్ బాస్ నిద్రలేపి మరీ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఉలిక్కిపడిన ఈ ముగ్గురు వెంటనే అలెర్ట్ అయిపోయి రంగంలోకి దిగారు.

ఇక నామినేషన్ల కోసం ఈసారి కలర్ ట్యూబ్ కాన్సెప్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరైతే నామినేట్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ బౌల్ లో ట్యూబ్ లో ఉన్న కలర్ వాటర్ ని వేయాలన్న మాట. ఇందులో సోహైల్, అరియనాలు సేవ్ కాగా మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్ లోకి వచ్చేశారు. అభిజిత్ ని నామినేట్ చేసిన విషయంలో హారిక మరోసారి తన యాక్టింగ్ టాలెంట్ ని బయటపెట్టింది. అఖిల్ మొనాల్ ల మధ్య ఎప్పటిలాగే చిన్న సైజు రచ్చ జరిగింది. నేను హార్ట్ తో ఆడతా నువ్వు బ్రెయిన్ తో ఆడతావని అఖిల్ చెప్పడం దానికి మొనాల్ గట్టిగానే బదులు చెబుతూ హార్ట్ కనెక్షన్ అంటూ ఏదేదో చెప్పుకొచ్చింది. ఇదంతా అవసరానికి మించిన ప్రహసనంగానే సాగింది.

కిచెన్ లోకి వచ్చాక మొనాల్ శోకరాగం పీక్స్ కు చేరుకుంది. తను ఇన్ని వారాలు ఉండడానికి కన్నీళ్లే కారణమని గట్టిగా నమ్ముతోంది కాబోలు ఈసారి డోస్ ఇంకా ఎక్కువ చేసింది. ఒకరకంగా చెప్పాలంటే వెగటు పుట్టే స్థాయిలో తను పెడుతున్న గగ్గోలు చూస్తుంటేనే లేనిపోని అనుమానాలు తలెత్తేలా ఉన్నాయి. నిజంగా బిగ్ బాస్ ఉద్దేశాల మీద అనుమానం వచ్చేలా మొనాల్ డ్రామా హద్దులు దాటుతోంది. ముఖ్యంగా మొనాల్ అఖిల్ ల మధ్య ట్రాక్ మాత్రం ఓ రేంజ్ లో సాగుతోంది. ఇంకో మూడు వారాల్లో షో ముగుస్తున్న తరుణంలో ఏ చిన్న అవకాశాన్ని పార్టిసిపెంట్స్ వదిలిపెట్టేలా లేరు. ఇంకా వీకెండ్ కి టైం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చూడాలో ఏంటో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి