iDreamPost

AP నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసుల అలర్ట్.. అటు అస్సలు వెళ్లదంటూ..!

Big Alert Form Khammam Police: హైదరాబాద్ వచ్చే వారికి పోలీసులు బిగ్ అలర్ట్. ఈ రూట్ లో వచ్చారంటే..

Big Alert Form Khammam Police: హైదరాబాద్ వచ్చే వారికి పోలీసులు బిగ్ అలర్ట్. ఈ రూట్ లో వచ్చారంటే..

AP నుంచి హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసుల అలర్ట్.. అటు అస్సలు వెళ్లదంటూ..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ ఏది అనగానే టక్కున సంక్రాంతి అని చెప్పేస్తారు. 2024 సంక్రాంతి పండుగ అట్టహాసంగా ముగిసింది. భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండగ జరుపుకున్నారు. మంగళవారం కనుమతో ఈ సంక్రాతి పండగ ముగిసింది. ఈ మూడ్రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు మరికొన్ని గంటల్లో భాగ్యనగరం మల్లీ కళకళ్లాడబోతోంది. ఇప్పటికే సొంతూరు వెళ్లిన వాళ్లంతా రిటర్న్ అయ్యేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల వల్ల సూర్యాపేట టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని పోలీసులు తెలిజేస్తున్నారు. దానిని నివారించేందుకు, ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు.. కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లే వాళ్లు మరిపెడ, తొర్రూరు, జనగామ రూట్ లో గానీ.. లేదంటే వరంగల్ మీదుగా హైదరాబాద్ కు వెళ్లేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండటమే కాకుండా.. జాతీయరహదారిపై ట్రాఫిక్ కూడా తగ్గించిన వాళ్లు కూడా అవుతారు. సాధారణంగా ఏటా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ తరహా సన్నివేశాలను చూస్తూనే ఉంటాం.

సంక్రాంతికి ఇంటికి వెళ్లేటప్పుడు, మూడ్రోజుల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు టోల్ గేట్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇప్పటి నుంచి మరో రెండ్రోజులు టోల్ గేట్లు వద్ద వందల కొద్దీ వాహనాలు బారులు తీరి ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఖమ్మం పట్టణం నుంచి హయత్ నగర్ వరకు ఈ ట్రాఫిక్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం పోలీసుల కీలక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్లు దాటేందుకు దాదాపు 30 నిమిషాల వరకు సమయం పడుతోంది.

హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండే పంతంగి టోల్ గేట్ వద్ద కూడా భారీఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి అధికారులు మాత్రమే కాకుండా.. ట్రాఫిక్ అధికారులు కూడా వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అదనంగా 10 గేట్లు ఏర్పాటు చేశారు. రానున్న రెండ్రోజుల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. వీటికి అదనంగా ప్రైవేటు వాహనాలతో జాతీయ రహదారులు అన్నీ రద్దీగా మారిపోతున్నాయి. మరి.. మీరు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్నారా? అయితే మరిపెడ, తొర్రూరు, జనగామ రూట్ లోనో.. వరంగల్ మీదుగానో సిటీకి వచ్చేలా ప్లాన్ చేసుకోండి.. ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్రయాణం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ విషయాన్ని షేర్ చేసి.. వారిని కూడా అలర్ట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి