iDreamPost

Bheemla Nayak : మళ్ళీ వాయిదా దిశగా పవన్ సినిమా ?

Bheemla Nayak : మళ్ళీ వాయిదా దిశగా పవన్ సినిమా ?

ఫిబ్రవరి 25 విడుదల లాక్ చేసుకున్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఆ డేట్ కి రావడం మీద మెల్లగా అనుమానాలు ముసురుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా నియమావళిని ఫిబ్రవరి 28 దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. దీన్ని అధిక శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో కాబోతున్నాయి. అదే జరిగితే వచ్చే నెల కూడా సగం సీట్లతోనే థియేటర్లు నడపాల్సి ఉంటుంది. తెలంగాణలో ఆంక్షలు లేవు కానీ ఏపిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా వేచి చూడాలి. ఒకవేళ కంటిన్యూ చేయాలనుకుంటే మాత్రం భీమ్లా వెనుకడుగు వేయక తప్పదు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు సైతం ఈ దిశగానే మాట్లాడటం గమనార్హం.

అదే జరిగితే పవన్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ చెందక తప్పదు. మళ్ళీ వాయిదా అనుకుంటే మార్చి కి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాగూ రాధే శ్యామ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఏదో ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటే బెటర్. లేదూ యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా పర్లేదు రిలీజ్ చేద్దామని ధైర్యం చేసినా డిస్ట్రిబ్యూటర్లు నుంచి అభ్యంతరం రావొచ్చు. ఫుల్ సీటింగ్ ఉంటేనే కొన్న రేట్లకు పవన్ సినిమాలు గిట్టుబాటు అవుతాయి కానీ ఫిబ్రవరి లాంటి సీజన్ లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా రిస్క్ అవుతుంది. ప్రస్తుతానికి భీమ్లా నాయక్ టీమ్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. విడుదల తేదీని నొక్కి వక్కాణించే పోస్టర్లను వదలడం లేదు.

దీని నిర్ణయం ఎలా ఉన్నా మార్చ్ మొదటి వారంలో అజిత్ వలిమై రావడం మాత్రం ఖాయమే. ఆ మేరకు అక్కడి పంపిణీదారులుకు సమాచారం కూడా ఇచ్చేశారు. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో ఇస్తారు. ఏప్రిల్ లో వచ్చే భారీ చిత్రాలు ప్రస్తుతానికి ప్రమోషన్ విషయంలో తొందరపడటం లేదు. ఆర్ఆర్ఆర్ కూడా మార్చిలో వస్తుందన్న నమ్మకాలు పెద్దగా లేవు. వీటి సంగతెలా ఉన్నా పవన్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా ఫిబ్రవరి 25నే రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు పోటీ ఏమి లేదు కానీ అలియా భట్ నటించిన బాలీవుడ్ మూవీ గంగుబాయ్ కటియావాడి ఇవాళే అదే డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చింది.

Also Read : Salaar : ఆధ్య గా వస్తున్న బ్యూటిఫుల్ శృతి హాసన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి