iDreamPost

Jump Trick Scam: పెట్రోల్ బంకుల్లో మరో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే నష్టం తప్పదు

మోసాలు చేయాలనుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను ఎంతమంది బట్టబయలు చేస్తున్నా గానీ ఇంకా కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. తాజాగా సరికొత్త స్కామ్ ఒకటి వెలుగు చూసింది. ఈ నయా స్కామ్ గురించి తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు.

మోసాలు చేయాలనుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను ఎంతమంది బట్టబయలు చేస్తున్నా గానీ ఇంకా కొత్త మోసం వెలుగు చూస్తున్నాయి. తాజాగా సరికొత్త స్కామ్ ఒకటి వెలుగు చూసింది. ఈ నయా స్కామ్ గురించి తెలుసుకోకపోతే మీరు చాలా నష్టపోతారు.

Jump Trick Scam: పెట్రోల్ బంకుల్లో మరో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే నష్టం తప్పదు

పెట్రోల్ బంకుల్లో కొంతమంది కస్టమర్లను మోసం చేయడం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. పెట్రోల్ సర్వ్ చేసే డెన్సిటీ మీటర్ పెట్రోల్ నాణ్యత, స్వచ్ఛతను చూపిస్తుంది. అయితే డెన్సిటీ రీడింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల కల్తీ లేని పెట్రోల్ ని పొందినట్లు మీరు నిర్ధారించుకోవచ్చు. అయితే కస్టమర్లు ఎప్పటికప్పుడు ఇటువంటి స్కామ్ ల పట్ల అప్రమత్తమవుతున్నారని కొంతమంది బంకు సిబ్బంది కూడా కొత్త కొత్త స్కామ్స్ తో ముందుకొస్తున్నారు. తాజాగా మరో స్కామ్ బయటపడింది. దీని పేరు జంప్ ట్రిక్ స్కామ్.

మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు సిబ్బంది డెన్సిటీ కరెక్ట్ గా ఉందని.. మీటర్ కూడా జీరో చేసి పెట్టాను అని చెబుతారు. ఇక్కడ వరకూ బానే ఉంటుంది. బంకు సిబ్బంది నిజాయితీగా ఉన్నాడే అని అనిపిస్తుంది. కానీ డెన్సిటీ మీటర్ లో అమౌంట్ కి సంబంధించిన నంబర్ అనేది వేగంగా పెరిగిపోతుంటుంది. జంప్ ట్రిక్ స్కామ్ లో మీరు డెన్సిటీ మీటర్ లో చూసే నంబర్స్ సడన్ గా స్కిప్ అవుతూ ఉంటాయి. సడన్ గా ఎక్కువ నంబర్ కి పెరిగిపోతుంటాయి. ఈ నంబర్ రీడింగ్ అనేది దశల వారీగా పెరగాలి. అలా పెరిగితేనే పెట్రోల్ ఖచ్చితంగా వస్తున్నట్లు లెక్క. లేదంటే మీరు మోసపోయారని అర్థం. పెట్రోల్ పంపు మెషిన్ ని టాంపర్ చేశారని అర్థం.

రూల్స్ ప్రకారం మీటర్ లో అమౌంట్ అనేది 5 రూపాయలు తగ్గాలి లేదా పెరగాలి. అంతేగానీ సరాసరి పది రూపాయల చొప్పున పెరుగుతూ పోతుంటే దాన్ని జంప్ ట్రిక్ స్కామ్ అని అంటారు. దీని వల్ల పెట్రోల్ అనేది తక్కువగా వస్తుంది. నంబర్ వేగంగా స్కిప్ అవ్వడం వల్ల మీరు ఎక్స్ పెక్ట్ చేసినంత పెట్రోల్ ఐతే రాదు. ఉదాహరణకు మీరు వంద రూపాయల పెట్రోల్ కొట్టమని చెప్తే.. మీటర్ రీడింగ్ లో అమౌంట్ అనేది 10, 15, 20, 25 ఇలా పెరుగుతూ వెళ్ళాలి. అలా కాకుండా 10, 20, 30 ఇలా పెరుగుతూ వెళ్తే అక్కడ ఏదో స్కామ్ జరుగుతుందని అర్థం. కాబట్టి పెట్రోల్ బంకుల్లో జరిగే ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డెన్సిటీ మీటర్, జంప్ ట్రిక్ టాంపరింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి. మీటర్ లో జీరో ఉంది కదా అని సంతృప్తి చెందడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఇది టాంపర్ చేస్తున్నారు.

డెన్సిటీ మీటర్ అనేది నాణ్యతను, స్వచ్ఛతను చూపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. డెన్సిటీ మీటర్ లో నంబర్స్ స్కిప్ చేయడం ద్వారా జంప్ ట్రిక్ స్కామ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. పెట్రోల్ ని పంపు చేసే నాజిల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాజిల్ అనేది ఆటో కట్ అయితే పర్లేదు.. ఒకవేళ మేన్యువల్ అయితే బంకు సిబ్బంది.. ఆపి ఆపి ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ కారణంగా ఫ్యూయల్ అనేది తక్కువ వస్తుంది. మరి ఈ విషయాన్ని షేర్ చేసి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అలర్ట్ చేయండి. బంకుల్లో జరిగే జంప్ ట్రిక్ స్కామ్స్ పై అవగాహన పెంచుకోండి. మరి పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మీకు తెలిసిన స్కామ్ లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి