iDreamPost

షాపింగ్‌మాల్‌లో పార్కింగ్ ఫీ గంటకు రూ.1000! ఈ దోపిడీ ఎక్కడంటే?

  • Published Mar 06, 2024 | 2:56 PMUpdated Mar 07, 2024 | 8:09 PM

చాలామంది వాహనాదారులు షాపింగ్‌మాల్స్‌కు వెళ్లినప్పుడు పార్కింగ్ అనేది ఫ్రీగా ఉండటమో లేక తక్కువ ధర ఉండటం అనేది చూస్తుంటాం. కానీ తాజాాగా ఓ షాపింగ్‌మాల్ లో మాత్రం గంటకు అంత భారీ మొత్తంలో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.

చాలామంది వాహనాదారులు షాపింగ్‌మాల్స్‌కు వెళ్లినప్పుడు పార్కింగ్ అనేది ఫ్రీగా ఉండటమో లేక తక్కువ ధర ఉండటం అనేది చూస్తుంటాం. కానీ తాజాాగా ఓ షాపింగ్‌మాల్ లో మాత్రం గంటకు అంత భారీ మొత్తంలో పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది.

  • Published Mar 06, 2024 | 2:56 PMUpdated Mar 07, 2024 | 8:09 PM
షాపింగ్‌మాల్‌లో పార్కింగ్ ఫీ గంటకు రూ.1000! ఈ దోపిడీ ఎక్కడంటే?

సాధారణంగా మనలో చాలామంది తరుచు ఏదో ఒక షాపింగ్‌మాల్స్‌కు వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా వీకెండ్ వచ్చిదంటే చాలు మహానగరంలోని మాల్స్ అన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక ఆ మాల్స్ కు వచ్చే వారి సంఖ్యతో పాటు వాహనాల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే వాహనాలతో పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోయి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని మాల్స్ లో ఈ పార్కింగ్ అనేది ఉచితంగా ఉంటుంది. ఇక మరికొన్ని మాల్స్ లో మాత్రం పార్కింగ్ కు ఛార్జీలు కూడా వసూలు చేస్తూంటారు. కాగా, ఈ ఛార్జెస్ అనేవి రూ.20 నుంచి రూ.50, 100 వరకు అలా వాహనాన్ని బట్టి, ఆ మాల్ ను బట్టి పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. కానీ, తాజాగా ఓ షాపింగ్ మాల్ లో మాత్రం గంటకు పార్కింగ్ ఫీజ్ భారీ మొత్తంలో వసూలు చేసే బోర్డు దర్శనమివ్వడం పై అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలామంది వాహనాదారులు సినిమా హల్లో కానీ, షాపింగ్ మాల్ లో కానీ తమ బైక్, కారులను పార్కింగ్ చేయాలంటే.. కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో నగదు వసూలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ షాపింగ్ మాల్ మాత్రం వాహనాల పార్కింగ్ కు ఫీజు రూ.1000 అని ఏకంగా ఓ బోర్డు పెట్టి ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ పార్కింగ్ ఫీజు ఒకరోజు, రెండు రోజులకు అనుకుంటే పొరపాటే. ఇక్కడ పార్కింగ్ చేస్తే గంటకు రూ.1000 కట్టాలి అని ఉండటంతో జనాలు షాక్ అవుతున్నారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. అయితే ఈ పార్కింగ్ ఛార్జెస్ అనేవి అక్కడ ఉన్న యూబీ మాల్‌లోనిది అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రీమియం పార్కింగ్‌కు గంటకు రూ.1000 అని ఉన్న బోర్డు వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కాగా, ఈ పార్కింగ్ ఫీజులను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.అలాగే ఇండియాలోనే సిలికాన్ సిటీలో పేరుగాంచిన బెంగళూరులో ఇంటి అద్దెలు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకానీ.. ఇలా పార్కింగ్‌లకు కూడా భారీగా వసూలు చేస్తారని ఇప్పుడే తెలిసింది అని ఒకరు కామెంట్ చేశారు.అలాగే బెంగళూరు శాన్‌ఫ్రాన్సిస్కోగా మారాలని నిరంతరం ప్రయత్నిస్తోందని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు బెంగళూరును ఇక నుంచి సింగపూర్, హాంకాంగ్, లండన్, దుబాయ్‌ల లాగా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేశారా అని రకరకాలుగా కామెంట్ చేశారు.

అయితే, కొందరు మాత్రం ఈ బోర్డు ఇప్పటిది కాదని.. 2012 నుంచి ఉంటుందని పేర్కొన్నారు.కాగా, ఇక మరికొందరు నెటిజన్లు మాత్రం షాపింగ్‌మాల్ నిర్వాహకులు.. పార్కింగ్ వాహనాలను నియంత్రించడానికే ఇలా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కువ పార్కింగ్ ఫీజులు పెడితే చాలా మంది తమ వాహనాలను పార్కింగ్‌లో ఉంచరని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి రోజుకు ఒక వాహనం 10 గంటలు పార్కింగ్ కు ఉంచితే రోజుకు రూ.10వేలు అంటే నెలకు రూ.3 లక్షలు, ఇలా అయితే ఏడాదికి రూ.36 లక్షలు అవుతుందని దానికి 20 శాతం వడ్డీ కలుపుకుటే రూ.18 కోట్లు అవుతుందని లెక్కలతో సహా పేర్కొన్నాడు.మరి, ఏది ఏమైనా గంటకు రూ.1000 ఛార్జెస్ చేసే ఈ ప్రీమియం పార్కింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి