iDreamPost
android-app
ios-app

కొత్త ఏడాది.. తొలి రోజే దారుణం..

వర్షిణి బీబీఏ చదువుతుంది. ఎప్పుడూ తాను నవ్వుతూ.. తన చుట్టూ ఉండే నలుగురినీ నవ్విస్తూ ఉండేది. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది.

వర్షిణి బీబీఏ చదువుతుంది. ఎప్పుడూ తాను నవ్వుతూ.. తన చుట్టూ ఉండే నలుగురినీ నవ్విస్తూ ఉండేది. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది.

కొత్త ఏడాది.. తొలి రోజే దారుణం..

సమస్య ఏదైనా కావచ్చు.. దానికంటూ ఓ కచ్చితమైన పరిష్కారం కచ్చితంగా ఉంటుంది. ఈ సృష్టిలో పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. బాగా ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అది శారీరక సమస్య కావచ్చు.. మానసిక సమస్య కావచ్చు. అయితే, కొన్ని సార్లు కొంతమంది చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. అమ్మ తిట్టిందని, ఫోన్‌ కొనివ్వలేదని, పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ఇలాంటి వాటికి కూడా ఆత్మహత్య చేసుకున్న వారు ఈ సమాజంలో ఉన్నారు.

దేశంలో నిత్యం పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. నిరాక్ష్యరాస్యుల దగ్గరినుంచి ఉన్నత చదువులు చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ యువతి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.  ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెంగళూరులోని సుధామనగరకు చెందిన 21 ఏళ్ల వర్షిణి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

tragedy in first day of new year

జయనగర కమ్యూనిటీ కాలేజీలో బీబీఏ చదువుతోంది. వర్షిణ చదువులో చాలా చురుకుగా ఉండేది. తాను నవ్వుతూ, తన చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉండేది. అందరితీ చక్కగా కలిసిపోయేది. అలాంటి యువతి ఏం కష్టం వచ్చిందో తెలీదు. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్‌ అయింది. ఈ మేరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లింది. గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొంత సేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యానుకు వేలాడుతున్న మృతదేహాన్ని గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వర్షిణి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దాని మీద క్లారిటీ లేదు. సూసైడ్‌ నోట్‌ లాంటిది కూడా లభించలేదు. పోలీసులు వర్షిణి తల్లిదండ్రుల్ని విచారిస్తున్నారు. అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.

 ఇది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణం నుంచి కూడా విచారణ చేస్తున్నారు. ఆమె చావుకు లవ్‌ ఎఫైర్‌ లాంటిది ఏమైనా కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. వర్షిణి స్నేహితులను కూడా విచారిస్తున్నారు. అలా కాని పక్షంలో కుటుంబసభ్యులతో ఏవైనా గొడవలు అయి ఈ నిర్ణయం తీసుకుందా అని కూడా విచారిస్తున్నారు. మరి, వర్షిణి ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి