iDreamPost

జయలలిత 468 రకాల బంగారు ఆభరణాల విడుదల! 6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి: బెంగుళూరు కోర్టు

సినీ తార, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి బెంగుళూరు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సినీ తార, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించి బెంగుళూరు కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

జయలలిత 468 రకాల బంగారు ఆభరణాల విడుదల! 6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి: బెంగుళూరు కోర్టు

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ప్రముఖ నటి జయలలిత తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి నటిగానే కాకుండా రాజయ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ఎంజీఆర్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంజీఆర్ మరణం తర్వాత రాజకీయ వారసురాలిగా పార్టీ పూర్తి బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే సమయంలో అదాయానికి మించిన అస్తుల కేసులో అరెస్ట్ కావడం, విడుదల కావడం జరిగింది.  తాజాగా జయలలిత అక్రమాస్తుల కేసు విషయంలో బెంగుళూరు కోర్టు సెన్సేషన్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2014 సెప్టెంబర్ 27న అదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. పదవిలో ఉండగానే అక్రమాస్తుల కేసులో నమోదు కావడంతో  సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే 2015 మే 11 న ఆమెను కర్ణాటక ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా తీర్పు ఇస్తూ విడుదల చేశారు. ఈ క్రమంలోనే మే 23 తిరిగి ఆమె సీఎం గా బాధ్యతలు చేపట్టారు. 2016, డిసెంబర్ 5న చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. తాజాగా జయలలిత అక్రమాస్తు కేసుల్లో భాగమైన బంగారం, వజ్రాభరణాలు, నగదు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగుళూరు లోని సివిల్ అండ్ సెస్సేన్స్ కోర్టు తేదీలను ప్రకటించింది. మార్చి 6,7వ తేదీల్లో వచ్చి బంగారు, వజ్రాభరణాలు, ఇతర వస్తువులు తీసుకు వెళ్లడానికి తమినళాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం 6 ట్రంకు పెట్టలతో రావాలని సూచించింది. అయితే ఈ రెండు రోజులు మాత్రం వేరే ఏ కేసులు కూడా వాదించకూడదు అని కోర్టు ఆదేశించింది.

1996 లో అక్రమార్జన కేసులో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు మొత్తం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 468 రకాల బంగారం, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, ఆభరణాలు, 740 ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 10 టీవీలు, 1 వీడియో కెమెరా, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 4 సీడీ ప్లేయర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, నగదు రూ.1,93,202 ఉన్నాయి. 2014 లో జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగుళూరు కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసుపై వాదోపవాదనలు జరుగూతూ వచ్చాయి. ఈ క్రమంలోనే స్వాధీనం చేసుకున్న వస్తువులు ప్రభుత్వ బ్యాంకు ల నుంచి గానీ బహిరంగ వేలం ద్వారా కానీ విక్రయించాలని తెలిపింది. అంతలోనే జయలలిత కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో మరోసారి విచారణ జరిపి ప్రత్యేక కోర్టు స్వాధీనం చేసుకున్న ఆభరణాలు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణ కోసం మొదటి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చే చేసినట్లు ఆ రాష్ట ప్రభుత్వ లాయర్ తెలిపారు. మరోవైపు దీనికి సంబంధించిన ఐదు కోట్ల డీడీని కర్ణాటక ప్రభుత్వానికి తమిళనాడు గవర్నమెంట్ అప్పటికే చెల్లించింది.. కాకపోతే ఆ మొత్తం తమ ప్రభుత్వ ఖజానాలో జమకాలేదని తెలిపింది. ఏది ఏమైనా జయలలిత ఆస్తుల విషయం మరోసారి తెరపైకి రావడంతో ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. మరీ జయలలిత ఆస్తుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి