iDreamPost

AC ఆన్ లో ఉన్నప్పుడు.. FAN వేసుకోవడం లాభమా? నష్టమా?

Ceiling Fan And AC Togeather: ఎండలు పెరిగిపోయాయి. అందరూ ఏసీలు ఆన్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ ని ఆన్ లో ఉంచుతున్నారా?

Ceiling Fan And AC Togeather: ఎండలు పెరిగిపోయాయి. అందరూ ఏసీలు ఆన్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ ని ఆన్ లో ఉంచుతున్నారా?

AC ఆన్ లో ఉన్నప్పుడు.. FAN వేసుకోవడం లాభమా? నష్టమా?

భానుడి భగ భగలకు భాగ్యనగరం వాసులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరి నెల మధ్య నుంచే సూర్యుడి ప్రతాపం చూపించడం ప్రారంభించేశాడు. ఈ దెబ్బకు అందరూ ఏసీలకు దుమ్ముదులపడం మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న ఏసీలకు సర్వీసింగ్ చేయించి రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఏసీలు ఆన్ చేసుకోవడం ప్రారంభించేశారు. మరి.. ఏసీలు ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నారా? అలా ఫ్యాన్ వేసుకోవడం లాభమో నష్టమో మీకు తెలుసా?

ప్రస్తుతం ప్రాతంతో సంబంధం లేకుండా ఏసీల వాడకం బాగా పెరిగిపోయింది. ఎండాకాలం వస్తోంది అనగానే ఏసీలు ఆన్ చేసేస్తారు. అయితే రెగ్యులర్ గా ఏసీలు వాడేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, సీజనల్ గా ఏసీ వాడే వాళ్లు మాత్రం సమ్మర్ కి ముందు మర్చిపోకుండా ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఏసీ మెరుగ్గా పనిచేయడమే కాకుండా.. పవర్ బిల్ కూడా తక్కువగా వస్తుంది. ముఖ్యంగా డస్ట్ లేకుండా చూసుకోవాలి. అలా డస్ట్ పేరుకుంటే మాత్రం ఏసీ కూలింగ తగ్గడమే కాకుండా.. పవర్ బిల్ కూడా అధికంగా వస్తుంది. అందుకే సమ్మర్ కి ప్రారంభంలోనే ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి. ఇక ఏసీ ఆన్ చేసినప్పుడు చాలామంది ఫ్యాన్ వాడుతూ ఉంటారు. అయితే ఎందుకు ఫ్యాన్ వేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అలా తెలయకుండానే ఎవరో చెప్పారు అని ఫ్యాన్ ఆన్ చేసుకుంటారు. మరి.. అలా చేయడం లాభమేనా?

మీకు రోజూ ఏసీ ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ వేసుకునే అలవాటు ఉంటే కంగారు పడకండి. మీకు అలాంటి అలవాటు ఉంటే మంచిదనే చెప్పాలి. అయితే మీరు ఫ్యాన్ ని టాప్ స్పీడ్ లో కాకుండా రెండు లేదా మూడులో పెట్టుకుంటే మంచిది. ఏసీ వేసుకుని ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. నష్టం లేకపోగా లాభమనే చెప్పాలి. ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల ఏసీ గాలి రూమ్ మొత్తానికి త్వరగా వ్యాపిస్తుంది. అలాగే రూమ్ వేగంగా చల్లబడేలా చేస్తుంది. అంతేకాకుండా ఇలా ఫ్యాన్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు ఏసీని తక్కువలో పెట్టుకున్నా చల్లగా ఉందనే భావన కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరు ఏసీని మరీ తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. నిపుణులు కూడా ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకోవడం వల్ల లాభమే తప్ప.. నష్టం ఉండదు అని చెప్తుంటారు.

కొంతమంది ఏసీలను ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటారు. అంటే ఎంత త్వరగా కూల్ అయితే ఎయిర్ కండిషనర్ అంత త్వరగా స్లీప్ మోడ్ కు వెళ్తుంది. అలా వెళితే పవర్ బిల్ తగ్గుతుంది. ఇలా మీరు ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకుంటే రూమ్ త్వరగా కూల్ అవుతుంది కాబట్టి.. ఏసీ కూడా ఫాస్ట్ గా ఆఫ్ అవుతుంది. పైగా ఫ్యాన్ వేసుకునే అలవాటు ఉంటే రూమ్ చల్లబడిన తర్వాత ఫ్యాన్ గాలితో చక్కగా నిద్రపోవచ్చు. మళ్లీ ఫ్యాన్ ఆన్ చేసుకోవడానికి లేవాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు ఏసీని సర్వీసింగ్ చేయించడం మాత్రం మర్చిపోవద్దు. సర్వీసింగ్ కాస్ట్ ఎక్కువ అవుతోంది అని నిర్లక్ష్యం చేస్తే.. కరెంట్ బిల్లు తడిచి మోపడు అవుతుంది. మరి.. ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి