iDreamPost

Ben Stokes: బెన్ స్టోక్స్ కు ఏమైంది? షాకింగ్ ఫొటో షేర్ చేసిన స్టార్ ఆల్ రౌండర్!

  • Author Soma Sekhar Published - 08:40 AM, Fri - 1 December 23

బెన్ స్టోక్స్ ఓ షాకింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్టోక్స్ కు ఏమైంది? అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

బెన్ స్టోక్స్ ఓ షాకింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో స్టోక్స్ కు ఏమైంది? అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  • Author Soma Sekhar Published - 08:40 AM, Fri - 1 December 23
Ben Stokes: బెన్ స్టోక్స్ కు ఏమైంది? షాకింగ్ ఫొటో షేర్ చేసిన స్టార్ ఆల్ రౌండర్!

వన్డే వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ దారుణమైన ప్రదర్శన ఇచ్చింది. పసికూన జట్ల కంటే అధ్వాన్నంగా ఆడిన ఇంగ్లాండ్ చెత్త ఆటతీరుతో టోర్నీ నుంచి ఇంటిదారి పట్టిన మెుదటి టీమ్ గా అపకీర్తిని ముటగట్టుకుంది. ఇక ఈ ప్రపంచ కప్ కోసం తన రిటైర్మెంట్ ను సైతం వెనక్కి తీసుకుని ఆడిన బెన్ స్టోక్స్ కొద్దిమేర రాణించినప్పటికీ.. ఇంగ్లీష్ టీమ్ కు మాత్రం ఘోర పరాభవాలు తప్పలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా స్టోక్స్ ఓ షాకింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రెండు చేతికర్రల సాయంతో ఈ ఫొటోలో అతడు కనిపిస్తున్నాడు. దీంతో స్టోక్స్ కు ఏమైంది? అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తాజాగా పోస్ట్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అతడికి ఏమైంది? అంటూ సోషల్ మీడియాల వేదికగా అడుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే? బెన్ స్టోక్స్ గత కొద్ది కాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే వరల్డ్ కప్ లో కూడా పాల్గొన్నాడు. ఈ మెగాటోర్నీ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన స్టోక్స్ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయ్యిందని హాస్పిటల్ ఎదురుగా చేతి కర్రల సాయంతో నిలబడి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

“నేను హాస్పిటల్ లో చేరాను.. సర్జరీ జరిగింది. ఇక కోలుకోవడమే మిగిలి ఉంది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలుత ఈ పిక్ చూసి ఆందోళన చెందిన అభిమానులు.. అసలు విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు. ఇక స్టోక్స్ టెస్టు ఫార్మాట్ కు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. వచ్చే ఏడాది జనవరిలో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీమ్ భారత్ కు రానుంది. మరి ఈ పర్యటన కల్లా స్టోక్స్ కోలుకుంటాడా? లేడా? అన్నది వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ben Stokes (@stokesy)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి