iDreamPost

క్రికెట్ ఫ్యాన్స్ కు BCCI గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ మ్యాచుల్లో ఫ్రీగా..!

క్రికెట్ ఫ్యాన్స్ కు BCCI గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ మ్యాచుల్లో ఫ్రీగా..!

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. వన్డే వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు అదొక పండుగనే చెప్పాలి. దాదాపు ఒక పుష్కరం తర్వాత ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు నెలన్నరపాటు ఈ టోర్నీ సాగనుంది. అక్టోబర్ 5న మొదటి జరగ్గా.. నవంబర్ 19న మెగా ఫైనల్ జరగనుంది. ఇప్పటికే ఈ మహా సంగ్రామం కోసం బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ మెగా టోర్నీ మొత్తం వేదికల్లో జరగనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ కి సంబంధించి బీసీసీఐ సర్వం సిద్ధం చేసింది.

ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈసారి వరల్డ్ కప్ గ్రూపుల వారీగా కాకుండా రౌండ్ రోబిన్ విధానంలో జరగనుంది. అంటే లీగ్ దశలో మొత్తం అన్ని టీమ్ లు.. ప్రతి ఒక్క టీమ్ తో ఆడతాయి. లీగ్ లో 45 మ్యాచ్ లు, రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ తో కలుపుకుని మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి.దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై వరల్డ్ కప్ జరగనుండటంతో.. అందరూ ఆనందంలో మునిగిపోయారు. చివరిసారి 2011లో భారత్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ధోనీ సేన ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ రోహిత్ శర్మ సారథ్యంలో అదే ఫలితం రిపీట్ కావాలంటూ కోరుకుంటున్నారు. ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే అటు వరల్ట్ కప్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు ఇప్పుడు బీసీసీఐ ఒక శుభవార్త చెప్పింది. అదేంటంటే.. ఎవరైతే వరల్డ్ కప్ మ్యాచులు చూడటానికి మైదానికి వెళ్తారో వారికి తాగేందుకు ఉచితంగా మంచినీళ్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిజానిక ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి. ఇంక వరల్డ్ కప్ మ్యాచ్ షెడ్యూల్ విషయంలో కాస్త గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

అదేటంటే దాయాదుల పోరును వాయిదా వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ని ముందుగా నిర్ణయించిన తేదీకి కాకుండా వాయిదా వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈ వార్తలపై జైషా పరోక్షంగా స్పందించారు. కానీ, సూటిగా సమాధానం చెప్పకుండా.. వరల్డ్ కప్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని సూచాయిగా చెప్పారు. అయితే కచ్చితంగా భారత్- పాక్ మ్యాచ్ తేదీ మారబోతున్నట్లు అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి