iDreamPost

విండీస్ సిరీస్.. స్టార్ ప్లేయర్ పై వేటు! రుతురాజ్, జైస్వాల్ కు చోటు..

  • Author Soma Sekhar Published - 05:24 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 05:24 PM, Fri - 23 June 23
విండీస్ సిరీస్.. స్టార్ ప్లేయర్ పై వేటు! రుతురాజ్, జైస్వాల్ కు చోటు..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమి తర్వాత.. టీమిండియా తొలి పర్యటనకు వెళ్లబోతోంది. జూలై 12 నుంచి వెస్టిండీస్ వేదికగా విండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించింది. టెస్ట్ లకు, వన్డేలకు రోహిత్ శర్మనే నాయకత్వం వహించబోతున్నాడు. కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో నిరాశపరిచిన స్టార్ ప్లేయర్ పై వేటు వేసింది.

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 12 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే టెస్ట్ లకు, వన్డేలకు మాత్రమే టీమ్ ను ప్రకటించింది బీసీసీఐ. టీ20 జట్టును ఇంకా ప్రకటించలేదు. ఇక జట్టులో భారీ మార్పులైతే ఏమీ చేయలేదు కానీ.. WTCలో నిరాశ పరిచిన స్టార్ బ్యాటర్ చతేశ్వర పుజారాను తప్పించింది. అతడి స్థానంలో జట్టులోకి యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లను ఎంపిక చేసింది. ఇద్దరు వికెట్ కీపర్లను కేఎస్ భరత్, ఇషాన్ కిషన్ లను తీసుకున్నారు.

కాగా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీకి ఈ సిరీస్ లో విశ్రాంతి ఇచ్చారు. యువ సంచలనం నవ్ దీప్ సైనిని టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఉమ్రాన్ మాలిక్ ను వన్డే జట్టులోకి తీసుకున్నారు. చాలా కాలం తర్వాత సంజూ శాంసన్ కు వన్డేల్లో అవకాశం కల్పించారు సెలక్టర్లు. యువ బౌలర్ ముకేశ్ కుమార్ కు కూడా అవకాశం కల్పించారు. వన్డే ప్రపంచ కప్ ముందున్న నేపథ్యంలో యంగ్ ప్లేయర్లకే ఎక్కువ అవకాశాలు కల్పించారు సెలక్టర్లు.

భారత జట్లు

టెస్టుల: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్, రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, సిరాజ్, ముకేష్ కుమార్, ఉనద్కత్, నవ్ దీప్ సైని

వన్డేలు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, గైక్వాడ్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, జడేజా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేష్ కుమార్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి