iDreamPost

పూర్తయిన బీసీ కార్పొరేషన్ల నియామకాలు

పూర్తయిన బీసీ కార్పొరేషన్ల నియామకాలు

బీసీ సామాజికవర్గ అభివృద్ధికి దేశంలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ఆయా కార్పొరేషన్లకు పాలక మండళ్ల నియామకాన్ని పూర్తి చేసింది. 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటన్నింటికీ ఆదివారం చైర్మన్లను ప్రకటించింది. సోమవారం డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేసింది. ఒక్కొక్క కార్పొరేషన్‌కు 12 మంది చొప్పన 56 కార్పొరేషన్లకు 672 మంది డైరెక్టర్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రకటించారు.

నామినేటెడ్‌ పదవుల్లోనూ మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలని చట్టం చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఆ మేరకు చైర్మన్, డైరెక్టర్‌ పోస్టుల్లో మహిళలను నియమించింది. 672 పోస్టుల్లో 339 పదవులు మహిళలకు, 333 పదవులు పురుషులకు కేటాయించింది. 139 బీసీ ఉప కులాల వారికి ప్రాధాన్యం ఇచ్చేలా.. ఆయా వర్గాల సామాజికవ స్థితిగతులు, ఇతర అంశాలను బేరీజు వేసుకుని డైరెక్టర్లను ఎంపిక చేసినట్లు మంత్రి చెల్లుబోయిన చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి