iDreamPost

చిరుతకే ప్రాణ భయాన్ని చూపించిన కొండ ముచ్చులు.. వైరల్ వీడియో!

చిరుతకే ప్రాణ భయాన్ని చూపించిన కొండ ముచ్చులు.. వైరల్ వీడియో!

అడవికి రారాజు అంటే సింహం అని టక్కున చెప్పేస్తారు. ఆ తర్వాత బలం పరంగా చూసుకుంటే దాని తర్వాతి స్థానం పెద్ద పులికే దక్కుతుంది. కానీ ఇవి రెండూ వేగంలో మాత్రం చిరుతను అందుకోలేవు. వేగం అనగానే అడవిలో అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క జంతువు చిరుతపులి. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వైరల్ కూడా అవుతోంది. అయితే చిరుతకు వేగం ఉన్నా బలం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అది కష్టపడి పట్టుకున్న వేటను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉంటుంది. అందుకే ఏదైనా జంతువుని చంపగానే తీసుకెళ్లి చెట్టు మీద పెట్టుకుంటుంది.

చిరుత బలంలో కాస్త వీక్ అని అందరికీ తెలిసిందే. కానీ, మరీ ఇంత వీక అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకోబోయే చిరుతకు ఒక కొండముచ్చుల మంద ప్రాణ భయాన్ని చూపించాయి. ప్రాణాలను పంజాలో పెట్టుకుని పరిగెత్తే పరిస్థితి కల్పించాయి. అటుగా వెళ్తున్న వారు ఆ మొత్తం ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ఓ మారుమూల ప్రాంతంలో జరింగింది. అక్కడ రోడ్డుపై సుమారు 50 కొండముచ్చుల(బబూన్స్) గుంపు రోడ్డుపై వెళ్తోంది. అటుగా ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక చిరుతపులి వచ్చింది. మంద నుంచి ఒంటరిగా ఉన్న ఒక కొండముచ్చుపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది భయంతో మందలోకి దూరుతుంది. ఈ గ్యాప్ లో అన్ని బబూన్స్ కలిసి ఈ చిరుతపైకి దాడికి దిగుతాయి. అవన్నీ కలిసి ఒక్కసారిగా మీదకు దూకగానే చిరుతపులి బెంబేలెత్తిపోయింది.

మొదట కాసేపు వాటిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ, అవన్నీ కలిసి కట్టుగా దాడికి దిగడంతో ఆ చిరుత ఏం చేయలేక తోక ముడిచింది. ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. వీటి దాడి కారణంగా ఆ రోడ్డుపై ట్రాఫిక్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాలా మంది కొండముచ్చులకు అంత బలం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జాతిని బబూన్స్ అంటారు. దీనిలో 5 రకాలు ఉంటాయి. ఇవి శాఖాహారులే గానీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాంసం కూడా తింటాయి. దాడి విషయానికి వస్తే.. ఇవి పేరుకు కొండముచ్చులు అయినా.. చింపాంజీ స్థాయిలో బైట్ ఫోర్స్ ని రిలీజ్ చేయగలవు. వీటి పదునైన కోరలతో అవతలి జంతువులను చీల్చేయగలవు. మనుషులు కూడా ఈ బబూన్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా అవి ప్రాణాలను తీసేయగలవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి