iDreamPost

పాక్‌ క్రికెట్‌లో అలజడి! కెప్టెన్‌ బాబర్‌ వాట్సాప్‌ చాట్‌ లీక్‌! అందులో ఏముందంటే..?

  • Author singhj Published - 08:05 PM, Mon - 30 October 23

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ టీమ్​లో మరో అలజడి రేగింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం వాట్సాప్ చాట్ లీకైంది. అసలు అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

వరుస ఓటములతో డీలాపడ్డ పాకిస్థాన్ టీమ్​లో మరో అలజడి రేగింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం వాట్సాప్ చాట్ లీకైంది. అసలు అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 08:05 PM, Mon - 30 October 23
పాక్‌ క్రికెట్‌లో అలజడి! కెప్టెన్‌ బాబర్‌ వాట్సాప్‌ చాట్‌ లీక్‌! అందులో ఏముందంటే..?

వన్డే వరల్డ్ కప్-2023లో దాయాది పాకిస్థాన్​కు ఏదీ కలసి రావడం లేదు. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికాపై ఓటములతో ఆ టీమ్ డీలాపడింది. పాక్ సెమీస్​ ఛాన్సులు దాదాపుగా క్లోజ్ అయినట్లే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబర్ సేన సెమీఫైనల్​కు క్వాలిఫై అవ్వడం కష్టమే. వరుసగా మ్యాచ్​లు ఓడుతుండటంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అతడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ టైమ్​లో పాక్ క్రికెట్​లో మరో అలజడి రేగింది.

పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రైవేట్ చాట్ లీకవ్వడం సంచలనంగా మారింది. కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) చీఫ్​ జాకా అష్రాఫ్​తో మాట్లాడేందుకు బాబర్ ఆజం ప్రయత్నిస్తున్నాడట. కానీ జాకా మాత్రం ఆజంతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదట. దీంతో టీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) సల్మాన్ నజీర్​తోనే బాబర్ కాంటాక్ట్​లో ఉంటున్నాడని ఈ చాట్స్​లో ఉన్నట్లు తెలుస్తోంది. బాబర్ ప్రైవేట్ చాట్​ను ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ లీక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్​పై పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది.

బాబర్ అసలు నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నమే చేయలేదు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్​తోనే టీమ్ కెప్టెన్ మాట్లాడతాడు. నాతో మాట్లాడడు’ అని జాకా అష్రాఫ్ చెప్పినట్లు సమాచారం. ఈ కాంట్రవర్సీకి సంబంధించి మరో వాట్సాప్ చాట్ కూడా వైరల్ అవుతోంది. ‘పీసీబీ ఛైర్మన్​ను సంప్రదించేందుకు మీరు ప్రయత్నించారా?’ అని పాక్ టీమ్ సీవోవో సల్మాన్ బాబర్​ను ప్రశ్నించారు. దీనికి బాబర్ స్పందిస్తూ.. ‘నేను సార్​కు కాల్ చేయలేదు’ అని రిప్లయ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ చాట్స్​కు సంబంధించిన ఏది నిజమో చెప్పలేని పరిస్థితి. దీంతో పాక్ ఫ్యాన్స్ పీసీబీపై సీరియస్ అవుతున్నారు. బాబర్ కెరీర్​ను నాశనం చేసేందుకే ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. పీసీబీ అధికారులే ఈ చాట్స్ లీక్స్ చేశారని ఆరోపిస్తున్నారు. మరి.. పాక్ క్రికెట్​లో అలజడి రేపుతున్న ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్, కోహ్లీతో పాటు బౌలర్లకే క్రెడిట్.. అతడ్ని ఎందుకు మర్చిపోతున్నారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి