iDreamPost

SS Rajamouli Mahabharat Movie: డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’ గురించి రాజమౌళి భారీ ప్ర‌క‌ట‌న , సినిమా ఎప్పుడంటే?

SS Rajamouli Mahabharat Movie: డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారత్’ గురించి రాజమౌళి భారీ ప్ర‌క‌ట‌న , సినిమా ఎప్పుడంటే?

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మ‌హాభార‌తం సినిమా నోరు విప్పారు. మింట్ కిచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళిని
మీకు ఏ ఆశయాలు మిగిలి ఉన్నాయ‌ని అడిగితే, నేను సినిమాల‌ను పెద్ద‌విగా, మ‌రింత పెద్ద‌విగా, గొప్ప‌గా తీయాల‌నుకొంటున్నాను. భార‌తీయ క‌థ‌ల‌ను ఈ ప్రపంచానికి చెప్పాల‌నుకొంటున్నాన‌ని అన్నారు. ఇక‌, మ‌హాభార‌తం(mahabharat) గురించి చెబుతూ, ఇది నా సుదీర్ఘమైన, సుదీర్ఘమైన, సుదీర్ఘమైన కలల ప్రాజెక్ట్. కానీ, నేను ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి చాలా టైం పడుతుంది. నేను “మహాభారతం”లోకి అడుగుపెట్టే ముందు, రెండు మూడు సినిమాలు చేస్తాన‌ని అన్నారు. బ‌హుశా 2025 త‌ర్వాత. కొత్త టెక్నాల‌జీతో మ‌హాభార‌తాన్ని ఈ ప్ర‌పంచం చూసేలా తీర్చిదిద్దాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశంలా క‌నిపిస్తోంది.

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి RRRతో మ‌రో అద్భుతాన్ని ఇండియ‌న్ స్క్రీన్ మీద ఆవిష్క‌రించారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ న‌టిస్తే, అతిథి పాత్ర‌లో అజయ్ దేవగన్ రేంజ్ పెంచారు. ఈ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి 2ని దాటి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. ఒక మాట‌లో రాజమౌళి తనతో తానే పోటీ పడుతున్నారు. మొత్తంమీద‌ RRR ప్ర‌పంచ వ్యాప్తంగా ₹1115 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రాల జాబితాలో, దంగల్, బాహుబలి ది కన్‌క్లూజన్, KGF 2 తర్వాత నాల్గవ స్థానం ఆర్ఆర్ఆర్ దే. ఆశ్చ‌ర్య‌మేంటంటే, కేజీఎఫ్ కు మూడో స్థానం ద‌క్క‌డం.

మింట్ ఇంట‌ర్వ్యూలో S.S. రాజమౌళి తన క‌ల‌ల‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం తన ప్లాన్ ను బైట‌పెట్టారు. అదే మ‌హాభార‌తం. ఇలాంటి భారతీయ ఇతిహాసాన్ని వెండితెర మీద‌కు తీసుకొనిరావాలంటే రాజ‌మౌళి క‌న్నా స‌మ‌ర్ధులు ఎవ‌రూ లేర‌నే అనుకోవ‌చ్చు. అది ఎంత‌ పెద్ద ఫ్రాంజైజ్ కానుందో రాజ‌మౌళికి తెలుసు. ఇది ప‌దివేల కోట్లరుపాయిల ప్రాజెక్ట్. ఇప్పుటికే ఆయ‌న మ‌హాభార‌తం గురించి ప‌ని మొద‌లుపెట్టార‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. మ‌హాభార‌తాన్ని తీయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. బ‌హుశా మూడు పార్టుల్లో ఆయ‌న తీయొచ్చు.

ఈలోగా అవ‌తార్ వ‌స్తోంది. టెక్నాల‌జీ మ‌రో మెట్టు ఎక్కుతుంది. అప్పుడు రాజ‌మౌళికి మ‌హాభార‌తం మీద మ‌రింత క్లారిటీ రావ‌చ్చు.

SS రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల RRR హాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చే
ఇంది. హాలీవుడ్ ప్ర‌ముఖుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్-సీజన్ అవార్డులలో Top Gun Maverick, The Batman, Turning Red, Cha Cha Real Smooth, Elvis, The Northmanను దాటి అవార్డుల‌ను గెల్చుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి