iDreamPost

రామ మందిర ప్రారంభోత్సవం: KCRకు ఆహ్వానం అందిందా..? కవిత ఏమన్నారంటే..

  • Published Jan 21, 2024 | 4:51 PMUpdated Jan 21, 2024 | 4:51 PM

అయోధ్య మందిర ప్రారంభోత్సవం కోసం దేశంలోని ప్రముఖులందరికి ఆహ్వానాలు అందాయి. మరి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం అందిందా లేదా అంటే

అయోధ్య మందిర ప్రారంభోత్సవం కోసం దేశంలోని ప్రముఖులందరికి ఆహ్వానాలు అందాయి. మరి మాజీ సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం అందిందా లేదా అంటే

  • Published Jan 21, 2024 | 4:51 PMUpdated Jan 21, 2024 | 4:51 PM
రామ మందిర ప్రారంభోత్సవం: KCRకు ఆహ్వానం అందిందా..? కవిత ఏమన్నారంటే..

దేశంలోని హిందువుల ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూస్తోన్న అయోధ్య మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం మరి కొన్ని గంటల్లో మొదలవ్వనుంది. జనవరి 22, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేతలు మీదుగా.. అయోధ్య మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనిపట్ల హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 శతాబ్దాల ఎదురు చూపులు, ఎన్నో పోరాటాల తర్వాత.. ఈ ఏడాదిన అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం సాధ్యపడింది. రేపు అనగా సోమవారం, జనవరి 22 నాడు మందిరంలో రామ్‌లల్లా (బాల రాముడి) విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం దాదాపు 8 వేల మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది.

ఇలా ఆహ్వానం అందుకున్నవారిలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటికే అయోధ్యకు చేరుకోగా.. మరి కొందరు రేపు కార్యక్రమం ప్రారంభ సమయానికి చేరుకోనున్నారు. అలానే తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయడు, చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలకు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వీరితో పాటు మరికొందరు ప్రముఖులను కూడా ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు మాత్రం మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దాంతో సీఎం రేవంత్ సహా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవరూ అయోధ్య మందిర ప్రారంభోత్సవం కార్యక్రమానికి హాజరు కావటం లేదు.

ఇక అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాక దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన కేసీఆర్‌కు తప్పకుండా ఆహ్వానం అందే ఉంటుందని.. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేనందున పార్టీ నుంచి ఎవరో ఒకరు హాజరయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్‌కు అయోధ్య నుంచి ఆహ్వానం అందిందా లేదా అన్న దాని మీద ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదే.

ఈ క్రమంలో తాజాగా.. కేసీఆర్‌కు ఆహ్వానం విషయమైబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. అయోధ్య రామ మందిర ట్రస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదని తెలిపారు. మందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్య నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు కవిత. అంతేకాక రాముడు అందరివాడని.. కొందరివాడు కాదన్నారు. ఏదో ఒక సందర్భంలో అయోద్యను సందర్శించే సందర్భం వస్తుందని చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నట్లే.. ఏదో ఒక రోజు అయోధ్యను కూడా సందర్శించే భాగ్యం తమకు కలుగుతుందని అన్నారు. రేపు జరిగే కార్యక్రమానికి ఎలాంటి అధికారిక ఆహ్వానం లేనందున వెళ్లలేకపోతున్నామని తెలిపారు కవిత. దాంతో కేసీఆర్‌కు ఆహ్మానం ఎందుకు పంపలేదు.. కారణాలు ఏంటి అని చర్చించుకుంటున్నారు జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి