iDreamPost

8 వేల కోట్లు దాటేసిన అవతార్ 2 కలెక్షన్లు కానీ …

8 వేల కోట్లు దాటేసిన అవతార్ 2 కలెక్షన్లు కానీ …

భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలైన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మొదటి వారం కనిపించిన దూకుడు తర్వాత తగ్గినప్పటికీ ఇటీవలే వచ్చిన వాటిలో ఒక్క ధమాకా మాత్రమే మాస్ ఆడియన్స్ మెప్పు పొందటంతో మరోసారి ఈ విజువల్ వండర్ కి ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అవతార్ 2 మొత్తం పన్నెండు రోజులకు గాను 1 బిలియన్ డాలర్లను దాటేసింది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారు 8278 కోట్లు. ఈ ఏడాది రిలీజైన హాలీవుడ్ మూవీస్ లో ప్రస్తుతానికి టాప్ గన్ మావరిక్, జురాసిక్ వరల్డ్ డామినియన్ తర్వాత మూడో స్థానంలో ఉంది.

ఇంకా రన్ చాలా ఉంది కాబట్టి వాటిని అధిగమించే అవకాశాలు లేకపోలేదు. అవతార్ 2 బ్రేక్ ఈవెన్ లెక్కలో చేసింది ఇప్పటిదాకా సగం ప్రయాణమే. ఇంకో బిలియన్ డాలర్లు వస్తేనే లాభాలు మొదలవుతాయి. క్రిస్మస్ సెలవులను బాగానే వాడుకున్న జేమ్స్ క్యామరూన్ టీమ్ ఇప్పుడు న్యూ ఇయర్ ని టార్గెట్ చేసుకుంది. ఇంకో పెద్ద వారాంతరాన్ని క్యాష్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇండియాలో 250 కోట్ల దాకా వసూలయ్యింది. మరో వంద గ్యారెంటీ అని ట్రేడ్ అంచనా. డిస్నీ నిజానికి పెట్టుకున్న టార్గెట్ అయిదు వందల కోట్లకు పైమాటే. కానీ ఫస్ట్ పార్ట్ అంత భీభత్సమైన టాక్ రాకపోవడం కొంత ప్రభావాన్ని చూపించింది.

ఇది హిట్ అనిపించుకుంటోంది కాబట్టి మూడో భాగానికి ప్లానింగ్ రెడీ అవుతోంది. తొమ్మిది గంటల ఫుటేజీని జేమ్స్ క్యామరూన్ ఆల్రెడీ ప్రొడక్షన్ టీమ్ కి ఇచ్చేశారు. వాళ్ళు ఆ పనిని పూర్తి చేశాకే ఫైనల్ వెర్షన్ కోసం ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది. దీని వ్యయం సెకండ్ పార్ట్ కంటే మూడింతలు ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు కాబట్టి దాని పరంగా టెన్షన్ లేదు కానీ ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కోసం పెట్టాల్సిన ఖర్చే చాలా ఎక్కువగా ఉండబోతోంది. నాలుగు అయిదు భాగాలు మొదలుపెడతారా లేదా అనే విషయంలో జేమ్స్ క్యామరూన్ స్పష్టత ఇవ్వడం లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోబోతున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి