iDreamPost

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం!

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలు చేశారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయవొచ్చు. అయితే దీని ప్రభావం ఆటో డ్రైవర్లపై బాగా పడుతుందని అంటున్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి పథకం అమలు చేశారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయవొచ్చు. అయితే దీని ప్రభావం ఆటో డ్రైవర్లపై బాగా పడుతుందని అంటున్నారు.

బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. గత నెల 7న ఎల్బీ నగర్ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా   ఆరు గ్యారెంటీ పథకాలపై తొలి సంతకం చేశారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెండు గ్యారెంటీ పథకాలను ప్రారంభించారు. అందులో మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేయవొచ్చు. రెండవది అర్హులైన వారికి రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కీంద బీమా సౌకర్యం. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్ లో ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణించవొచ్చు. ఇందుకు గాను తెలంగాణలో ఉంటున్నట్లు ఏదైనా గుర్తింపు కార్డు ఉండాలి. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మహిళలు, విద్యార్థులు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘం వారు వాపోయారు.

డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ జర్నీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. మహిళలు, విద్యార్థినిలు, ఉద్యోగులతో కిట కిటలాడిపోయే ఆటోలు, క్యాబ్ లు ఖాళీ గా ఉండిపోతున్నాయి. మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ బాగా పెరిగిపోయింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్దీ పొందుతున్నా.. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నామంటున్నారు. రోజూ 1000 రూపాయాలు వచ్చేది కేవలం రూ.300 మాత్రమే వస్తున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4 న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టేందుకు పిలుపునిచ్చారు. ఇందులో ఆటో డ్రైవర్లు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని కోరారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చిందని. ఇంటి అద్దెలు, ఆటో ఫైనాన్స్, పిల్లల చదువులు, నెలవారి ఖర్చులు భారమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘ నాయకులు అంటున్నారు. మహాలక్ష్మ పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని.. వారికి ప్రతి నెల రూ. 15 వేల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్ లో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంటున్నారు. మరి మహాధర్నా పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి