iDreamPost

ఈ డ్రైవర్ తన ఆటోలో రాసిన మాటలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి!

  • Published Apr 06, 2024 | 12:43 PMUpdated Apr 06, 2024 | 12:43 PM

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల న్యూస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రం భలే సరదాగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల న్యూస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రం భలే సరదాగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే న్యూస్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

  • Published Apr 06, 2024 | 12:43 PMUpdated Apr 06, 2024 | 12:43 PM
ఈ డ్రైవర్ తన ఆటోలో రాసిన మాటలు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి!

అందరి అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్న నిమిషాల్లో వైరల్ అవ్వడం, ట్రెండ్ అవ్వడం మొదలయిపోయింది. దీని వలన నిమిషాల్లో వార్తల్లో తెలియడం ఒక ఎత్తైతే .. పాపులర్ అవ్వడం కోసం యువతి యువకులు చేసే వికృత విన్యాసాలు ఒక ఎత్తు.. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరచూ వింటూ.. దానికి సంబంధించిన వీడియోస్ చూస్తూ వస్తున్నాం. దీనితో చాలా మందికి సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే విసుగుగా మారిపోతుంది. అయితే, మంచి చెడు రెండు ఉన్నట్లు .. సోషల్ మీడియాలో కూడా అలాంటి వీడియోస్ తో పాటు.. అప్పుడపుడు కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కనిపిస్తూ ఉంటాయి. కాసేపు సరదాగా వాటిని చూసి నవ్వుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్తా కూడా ఇలాంటిదే. ఒక ఆటో డ్రైవర్ ఆవేదన అందరికి నవ్వు తెప్పించేస్తుంది. ఆవేదన నవ్వు రప్పించడం ఏంటో అసలు ఏం జరిగిందో చూసేద్దాం.

సాధారణంగా అందరూ రోజు ఆటోలలో ప్రయాణిస్తూనే ఉంటారు. దానిలో ఆశ్చర్య పడాల్సింది ఏమి లేదు. అయితే, ఆటో ఎక్కినపుడు అందరు ఆటో డ్రైవర్ ను కామన్ గా పిలిచే పదం అన్న లేదా భయ్యా . ఈ పదం రోజులో కనీసం ఆటో ఎక్కిన ప్రతి సారి ఒక్కరైనా అంటూ ఉండడం ఇప్పటివరకు వింటూనే ఉన్నాము. అయితే అందులో ఏం విశేషం ఉంది అనుకుంటారా.. అసలు విషయం ఇక్కడే ఉంది. అదేంటంటే.. తాజాగా ఒక యువతి ఒక ఆటోలో ప్రయాణిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేసింది. సహజంగా ఆటోల వెనుక రకరకాల కొటేషన్స్ రాస్తుంటారు. కొన్ని భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఒక ఆటో డ్రైవర్ ఆటో లోపల ఒక కొన్ని విషయాలను రాసి బోర్డు తగిలించుకున్నాడు. అదేంటంటే.. “ఆటో సీట్ వెనుక దూరాన్ని పాటిస్తూ సురక్షితంగా ఉండండి. నన్ను భయ్యా అని పిలవకండి..ప్లీస్ దాదా, భాయ్ , బాస్, అని పిలవండి.” అంటూ రాసుకొచ్చాడు.

దానికి సంబంధించిన ఫోటోను ఒక యువతి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో .. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. భయ్యా అని పిలిస్తే ఇంత భాదగా ఉంటుందా అని .. అందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిని కేవలం అమ్మాయిలను ఉద్దేశించి రాశాడా లేక అందరి కోసం రాశాడా..అసలు దీనికి గల కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ, ఈ పోస్ట్ మాత్రం అందరికి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దీనితో ఇప్పుడు షేర్స్, లైక్స్, కామెంట్స్ తో నెట్టింట షికార్లు చేస్తోంది. ఏదేమైనా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఇక నుంచైనా ఆ ఆటో డ్రైవర్ ఆవేదన అందరికి అర్ధం అవుతోందో లేదో వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి