iDreamPost

మంచి అవకాశం.. AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. 35 వేల జీతం

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

మంచి అవకాశం.. AP దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.  35 వేల జీతం

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. వాటి దరఖాస్తు ప్రకియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగం లేదని బాధపడుతున్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 35 వేల జీతాన్ని అందుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి.

ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో వీటిలో 40 ఏఈఈ పోస్టులు, 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 05 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య:

  • 70.

విభాగాల వారీగా ఖాళీలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్):

  • 35

అర్హత:

  • సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఎంపికైన వారికి రూ.35,000 అందిస్తారు.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్):

  • 05

అర్హత:

  • సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం:

  • ఎంపికైన వారికి రూ.35,000 అందిస్తారు.

టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్):

  • 30

అర్హత:

  • బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఎల్‌సీఈ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

జీతం:

  • ఎంపికైన వారికి రూ.25,000. అందిస్తారు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

  • రూ.500.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ 500 032 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 05-01-2024.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి