iDreamPost

విద్యార్థులకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్.. ఏడాదంతా ఆ ఉత్పత్తులపై డిస్కౌంట్!

  • Author Soma Sekhar Published - 07:00 PM, Sat - 5 August 23
  • Author Soma Sekhar Published - 07:00 PM, Sat - 5 August 23
విద్యార్థులకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్.. ఏడాదంతా ఆ ఉత్పత్తులపై డిస్కౌంట్!

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. దాంతో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లాంటి స్మార్ట్ యాక్ససరీస్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ ఉత్పత్తులను తక్కువ రేటుకు తయ్యారు చేయడానికి మార్కెట్ లోకి ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అయితే కొత్తగా వచ్చే కంపెనీల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రముఖ కంపెనీలు వినియోగదారులకు కొన్ని డిస్కౌంట్స్ ను ప్రకటిస్తుంటాయి. అయితే ఈ డిస్కౌంట్స్ కొన్ని రోజుల వరకే అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభవార్త చెప్పింది యాపిల్ కంపెనీ. విద్యార్థుల కోసం కొన్ని ఉత్పత్తులపై సంవత్సరమంతా డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ కంపెనీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. యాపిల్ సంస్థ ఉత్పత్తులను ప్రీమియం క్వాలిటీతో అందిస్తూ.. వినియోగదారుల ఆదరణ పొందింది. అయితే యాపిల్ కంపెనీ అందించే వస్తువుల రేటు ఇతర కంపెనీల ధరలతో పోల్చితే ఎక్కువగా ఉంటాయి. కాగా.. యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్స్ ఉన్నప్పటికీ అవి కొన్ని రోజుల వరకే ఉంటాయి. అయితే స్టూడెంట్స్ కు ఏడాదంతా డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ను ఎలా పొందాలంటే?

ముందుగా యాపిల్ ఎడ్యుకేషన్ వైబ్ సైట్ లోకి వెళ్లి.. అక్కడ యూనిడేస్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. మీ అర్హతను ధ్రువీకరించిన తర్వాత స్టూడెంట్ ఐడీ లేదా స్కూల్ ఈ-మెయిల్, అడ్రస్ ను నమోదు చేయాలి. మీరు స్కూల్ టీచర్ అయితే టీచింగ్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాలి. ఇలా చేయగానే విద్యార్థులకు అందించే ప్రత్యేక డిస్కౌంట్లు చూడవచ్చు. ఈ డిస్కౌంట్స్ మ్యాక్ బుక్స్, ఐమ్యాక్, ఐప్యాడ్ సహా అనేక రకాల యాపిల్ ఉత్పత్తులకు వర్తిస్తాయి. మీరు ఆన్ లైన్ లో లేదా యాపిల్ స్టోర్స్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

కాగా.. ఈ ఆఫర్లలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే? ఇతర ఆఫర్లు, ప్రమోషన్లలో ఈ డిస్కౌంట్స్ ను కలపరు. ఈ డిస్కౌంట్ పొందాలంటే మీరు 16 సంవత్సరాలు పైబడి లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మ్యాక్ కంప్యూటర్లు, ఐప్యాడ్ యాపిల్ ఉత్పత్తులపై 10 శాతం నుంచి 15 శాతం వరకు మీరు ఆదా చేయవచ్చు. మ్యాచ్ కంప్యూటర్ కొనుగోలుతో ఫ్రీగా ఎయిర్ పాడ్ లు, ఐప్యాడ్ కొనుగోలుతో ఉచిత యాపిల్ పెన్సిల్ కూడా పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం అధికారిక యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ వెబ్ సైట్ ను చూడండి.

ఇదికూడా చదవండి: చీరల కోసం కొట్టుకున్న మహిళలు.. కాల్పులకు తెగబడిన భర్తలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి