iDreamPost

విజయవాడలో కార్‌ రేసింగ్‌ కలకలం.. ముక్కలైన స్కూటీలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు

  • Published Nov 19, 2023 | 6:44 PMUpdated Nov 19, 2023 | 6:44 PM

ఆదివారం తెల్లవారు జాము ప్రాంతంలో నగరంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్కూటీలు రెండు ముక్కలు కాగా.. మనుషులు గాల్లోకి ఎగిరి పడ్డారు. ఆ దారుణం వివరాలు..

ఆదివారం తెల్లవారు జాము ప్రాంతంలో నగరంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంతో విజయవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్కూటీలు రెండు ముక్కలు కాగా.. మనుషులు గాల్లోకి ఎగిరి పడ్డారు. ఆ దారుణం వివరాలు..

  • Published Nov 19, 2023 | 6:44 PMUpdated Nov 19, 2023 | 6:44 PM
విజయవాడలో కార్‌ రేసింగ్‌ కలకలం.. ముక్కలైన స్కూటీలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకులు

అతివేగం ప్రమాదం అని ఎందరు చెప్పినా కొందరు ముర్ఖులు మాత్రం మాట వినడం లేదు. అత్యుత్సాహంతో అతివేగంగా వెళ్లి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇక తాజాగా విజయవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున రాత్రి వేళ కారు రేసింగ్‌లు నిర్వహిస్తూ.. ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యారు. మరో దారుణ విషయం ఏంటంటే.. ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన ఈ రేస్‌ కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన రేస్‌ కారులు రోడ్డు మీద వేళ్తున్న రెండు స్కూటీలను ఢీకొట్టాయి. ఈ ఘటనలో స్కూటీలు రెండు ముక్కలవ్వగా.. పలువురు గాల్లోకి ఎగిరి పడ్డారు. ఆ వివరాలు..

ఆదివారం తెల్లవారుజామున విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి నిర్వహించిన కార్ల రేసింగ్‌ కారణంగా ఈ దారుణం చోటు చేసుకుంది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. రేస్‌లో భాగంగా దూసుకుపోతున్న ఓ ఫార్చూన్యర్‌ కారు.. రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్కూటీలపై ఉన్న నలుగురు యువకులు గాల్లోకి ఎగిరిపడ్డారు. స్కూటీలు కూడా రెండు ముక్కలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన స్థానికులు.. వెంటనే స్పందించి.. తీవ్ర గాయాలైన యువకులను ఆస్పత్రికి తరలించారు. అలానే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్కూటీలు రెండు ముక్కలు కాగా, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. ప్రస్తుతం విజయవాడ గురునానక్ కాలనీలో రేసింగ్ నిర్వహిస్తున్న నలుగురు యువతులు, యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గ్రూపుల్లో ఎవరెవరు ఉన్నారు.. ఎప్పటి నుంచి కారు రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాక వీరు నగరంలోని ఏఏ ప్రాంతాలలో రేసింగ్ లు నిర్వహిస్తున్నారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాదానికి కారణమైన కారులో ఇద్దరు పురుషులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫుల్లుగా మద్యం తాగి ప్రమాదం చేశారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి