iDreamPost

విప‌క్షాల దుష్ప్ర‌చారం.. పేద‌ల‌ ప‌థ‌కాల‌కు ప్ర‌మాదం

విప‌క్షాల దుష్ప్ర‌చారం.. పేద‌ల‌ ప‌థ‌కాల‌కు ప్ర‌మాదం

క‌రోనా విప‌త్తు స‌మ‌యంలో దేశంలోని ప్ర‌జ‌లు ప్ర‌ధానంగా పేద‌లు విల‌విల‌లాడారు. ప‌నులులేక‌.. చేతిలో డ‌బ్బులేక అల్లాడిపోయారు. నిత్యావ‌స‌రాల‌కూ ఇబ్బందులు ప‌డ్డారు. కానీ.. ఏపీలోని మెజార్టీ పేద‌లు మాత్రం తిండికి ఇబ్బంది లేకుండా పోయింది. అందుకు కార‌ణం అక్క‌డి ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు. క‌రోనా కాలంలో కూడా న‌గ‌దు బ‌దిలీ చేయ‌డం. అలాంటి ప‌థ‌కాల‌కు ప్ర‌మాదం వాటిల్లేలా విప‌క్షాలు ప‌ధ‌కం రూపొందిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్రణాళికతో విషం క‌క్కుతున్నాయి.

అప్పులు ఇప్పుడే కొత్త కాదు. అప్పుడు చంద్రబాబు కూడా పెద్దఎత్తున అప్పులు తెచ్చారు. ఆ మాట‌కొస్తే అప్పుల‌కు బార్లా త‌లుపులు తెరిచింది ఆయ‌నే. పోలవరం చూడటానికి, సింగపూర్‌ ఏజెన్సీకి, అమరావతి డిజైన్లకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేసే సొమ్ములో సగం టీడీపీ నేతలకు, జన్మభూమి కమిటీల్లోని ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన జేబుల్లోకి చేరేవ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా ల‌క్ష‌న్న‌ర కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ నేరుగా ప్ర‌జ‌ల‌కు అందించార‌న్న ఖ్యాతి ఉంది. కానీ.. ఎల్లో మీడియా, తెలుగుదేశం ప్ర‌చారాలు, రాత‌లు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి.

వాటి ఉద్దేశం ఇదేనా

ఎల్లో మీడియా, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తీరును ప‌రిశీలిస్తే పేద‌ల‌కు ప‌థ‌కాలు అంద‌కుండా, చేయ‌కుండా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తున్నారు. అమ్మఒడి, చేయూత, వైఎస్సార్‌ ఆసరాను ఆపేయాలా?, 52.4 లక్షల రైతు కుటుంబాలకు అందించిన వైఎస్సార్‌ ‘రైతుభరోసా’ను నిలిపేయాలా?, 31 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చెయ్యొద్దా?, విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా కానుకను అడ్డుకోవాలనేది వారి ఉద్దేశమా?, జగనన్న గోరుముద్ద పథకానికి మంగళం పాడాలా? , ఆసుపత్రులను చక్కగా తీర్చిదిద్దుతున్న నాడు–నేడు పథకాన్ని అటకెక్కించాలా?, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కూడా ఇవ్వొద్దా?, వైఎస్సార్‌ నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను నిలిపివేయాలా? వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి గొప్ప పథకాలను అటకెక్కించాలా?, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆపేయాలా? మ‌రి వీటికి ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి