iDreamPost

మూడుతో పాటు మ‌రో ఏడు వైద్య క‌ళాశాల‌ల కోసం ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు

మూడుతో పాటు మ‌రో ఏడు వైద్య క‌ళాశాల‌ల కోసం ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు

ఏపీలో ప్ర‌భుత్వ వైద్య రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు నాడు నేడు అంటూ విన్నూత్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేసింది. తాజాగా కేంద్రం నుంచి మూడు మెడిక‌ల్ కాలేజీల‌కు అనుమ‌తి సాధించింది. వాటిని బంద‌రు, అర‌కు, గుర‌జాల‌లో ఏర్పాటు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో మ‌రో ఏడు మెడిక‌ల్ కాలేజీల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. త‌ద్వారా బోధ‌నాసుప‌త్రుల సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా ఎక్కువ మెడిక‌ల్ సీట్లు సాధించి విద్యార్థుల‌కు, ఎక్కువ ప‌డ‌క‌ల ఆసుప‌త్రుల‌తో రోగుల‌కు మెరుగైన సేవ‌లందించాల‌నే సంక‌ల్పంతో సాగుతోంది.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వ మెడిక‌ల్ మెడిక‌ల్ కాలేజీలు 11 ఉన్నాయి. అవి శ్రీకాకుళం, విశాఖ‌, కాకినాడ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు. ఒంగోలు, క‌ర్నూలు. తిరుప‌తి, అనంత‌పురం, క‌డ‌ప వంటి చోట్ల ఉన్నాయి. తాజాగా మ‌రో 3 కాలేజీల‌కు కేంద్రం అనుమ‌తిచ్చింది. వాటిని 60, 40 శాతం చొప్పున కేంద్రం, రాష్ట్రం నిధులు కేటాయించి నిర్మిస్తారు. త‌ద్వారా ఏపీలో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల సంఖ్య 14కి చేర‌తాయి. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా విజ‌య‌న‌గ‌రం, ఏలూరు, నెల్లూరు స‌హా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఏలూరు బోధ‌నాసుప‌త్రికి శంకుస్థాప‌న కూడా చేశారు.

అద‌నంగా ఏడు వైద్య క‌ళాశాల‌ల‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తున్న నేప‌థ్యంలో అవి కూడా తోడ‌యితే ఏపీలో విద్యార్థుల‌కు మ‌రింత ఉప‌యోగ‌ప‌డుతుంది. మెడిక‌ల్ కాలేజీల‌లో సీట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. అదే స‌మ‌యంలో రోగుల‌కు వైద్య స‌దుపాయాలు మెరుగుప‌డ‌తాయ‌న‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌స్తుతం మూడు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి అందుబాటులోకి వ‌స్తున్న నేప‌థ్యంలో మిగిలిన కాలేజీల విష‌యం ఎప్ప‌టికి స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్న‌ది కేంద్రం చ‌చేతుల్లో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి