iDreamPost

చేతికి ఎముకలేని సీఎం

చేతికి ఎముకలేని సీఎం

అడిగిందే తడవుగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వరాలు ప్రకటిస్తున్నారు. ఈ సీఎం చేతికి ఎముకలేదేమో అన్నట్లుగా ఆయన చిరుజీవుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన సంవత్సరాల తరబడి పని చేస్తున్నా కనీస వేతనాల కరువైన వారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ వరాలు కురిపిస్తున్నారు.

తాజా సర్వశిక్షాభియాన్‌లో పని చేస్తున్న సీఆర్‌పీ(క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌)లకు ఒకే దఫా ఐదు వేల రూపాయల జీతం పెంచారు. అంతకు ముందు వీరి జీతం 18,500 వేల రూపాయలుండగా.. పెంచిన మొత్తంతో కలిపి వారి జీతం 23,500లకు చేరుకుంది. సీఎం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సీఆర్పీలకు మేలు చేకూరింది. విద్యా వ్యవస్థలో వీరు కీలకమైన విధులు నిర్వర్తింటారు. మధ్యాహ్న భోజన పథకం తనిఖీ, తరగతుల సందర్శన, బడిబయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం, పాఠశాలల్లో సదుపాయాల కొరత గుర్తించి ప్రభుత్వానికి నివేదించడం వంటి బాధ్యతలు వీరు నిర్వర్తిస్తున్నారు.

ఇప్పటికే పలు విభాగాల్లో తాత్కాలిక విధానంలో సేవలందిస్తున్న సిబ్బందికి సీఎం జగన్‌ జీతాలు భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆశా వర్కర్లకు మూడు వేల నుంచి పది వేల రూపాయాలకు పెంచారు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే పారిశుధ్య సిబ్బందికి 9 వేల నుంచి 16 వేల రూపాయలకు పెంచారు. పోలీసు శాఖలో పని చేస్తున్న హోం గార్డులకు 18 వేలుగా ఉన్న జీతాన్ని 21 వేలు చేశారు. వెలుగు యానిమేటర్ల జీతం మూడు వేల రూపాయల నుంచి 10 వేలకు పెంచారు. 108 డ్రైవర్‌కు 13 వేల నుంచి 28 వేలకు, టెక్నిషియన్‌కు 15 వేల నుంచి 30 వేల రూపాయలకు పెంచారు. 104 వాహన టెక్నిషియన్, ఫార్మసిస్ట్‌ల జీతం 17,500 రూపాయల నుంచి 28 వేల రూపాయలకు పెంచారు. డ్రైవర్లకు 15 వేలుగా ఉన్నా జీతం మొత్తాన్ని 28 వేలకు పెంచారు.

అందుకే సీఎం జగన్‌ను చిరు జీవులు తమ పాలిట దైవంగా భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి