iDreamPost

దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

ససై్టనబుల్‌ డెవలెప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) నివేదికలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. ఎస్‌డీజీ ని సాధించే క్రమంలో ఆయా రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతిపై నితి అయోగ్‌ నివేదిక రూపాందిస్తుంది. ఇందులో భాగంగా రెండో దఫా నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో 70 మార్కులతో కేరళ మొదటి స్థానంలో నిలవగా 69 మార్కులతో హిమాచల్‌ ప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ 67 మార్కులతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు అదే ర్యాంకు సాధించాయి.

ఈ జాబితాలో 48 మార్కులతో బిహార్‌ చివరి స్థానంలో నిలిచింది. 2018లో నితి అయోగ్‌ ఎస్‌డీజీ అమలు చేస్తున్న రాష్ట్రాలకు మొదటి సారిగా ర్యాంకులు ప్రకటించింది. ఏడాదిలోనే పలు రాష్ట్రాలు మంచి ఫలితాలను సాధించాయి. 2018లో 29 స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో 23 స్థానానికి ఎగబాకింది. 23 స్థానంలో ఉన్న ఒరిస్సా 13వ స్థానానికి చేరుకుంది. 15వ స్థానంలో సిక్కిం 7వ స్థానానికి వచ్చింది.

2030 నాటికి ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, పర్యావరణ రక్షణ, లింగ వివక్షత నిర్మూలన, మహిళాభివృద్ధి తదితర 17 అంశాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఎస్‌డీజీలను 2015లో రూపొందించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి