P Venkatesh
నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యూలర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యూలర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
P Venkatesh
ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించడం చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పేదలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. అనారోగ్యాలకు గురై వైద్య ఖర్చులు భరించలేక అప్పులపాలవుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోంది. దీనిలో భాగంగానే అవసరమైన వైద్య సిబ్బందిని నియమించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.
ఏపీలో ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసింది ప్రభుత్వం. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను వాకిన్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.