iDreamPost

దర్శనాలకు దూరం

దర్శనాలకు దూరం

కోవిడ్‌ 19 కారణంగా భక్తులకు భగవంతుళ్ళు దూరమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో సాధారణ దర్శనాలకు అనేక ఆంక్షలు పెట్టేసారు. తాజాగా పలు ప్రముఖ ఆలయాల్లో కూడా ఇది కొనసాగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనాలను ఈ నెల 23వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం దేవస్థానంలోని పలువురు కోవిడ్‌ భారిన పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే దర్శనాల నిలిపివేత కొనసాగుతుండగా తాజాగా ఈనెల 23వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. స్వామివారికి ప్రతిరోజూ జరిగే నిత్య పూజా కార్యక్రమాలు యధావిధిగా జరుగుతాయని, భక్తుల దర్శనాల వరకు మాత్రమే ఆంక్షలు ఉంటాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.

దేవస్థానానికి సంబంధించి ఇప్పటి వరకు యాభై మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో కొందరు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండగా, మరికొందరు దేవస్థానం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా పలువురి టెస్టు రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సాధారణ భక్తులకు దర్శనాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే కోవిడ్‌ కేసులు తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి