iDreamPost

అశాంతిజ్యోతి…ఈ ఆంధ్రజ్యోతి…!

అశాంతిజ్యోతి…ఈ  ఆంధ్రజ్యోతి…!

పేరు సత్యనారాయణ….కానీ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే…! ఇంకొకరి పేరు శ్రీరాములు…. కానీ అతనికి ముగ్గురు భార్యలు ఉంటారు…! పేర్లకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తులు సమాజంలో తారసపడుతూనే ఉంటారు. విచిత్రంగా మనుషులే కాదు పత్రికలూ ఈ కోవకు చెందుతాయని ఆంధ్రజ్యోతి నిరూపిస్తోంది.

నా రూటే సెపరేట్…

అంధ్రజ్యోతి…. ఇదేదో ఆంధ్రప్రదేశ్ లో వెలుగు నింపుతుందనో… కాగడలా రాష్ట్రానికి సరైన మార్గం చూపుతుందనో అనుకుంటే పొరపాటే…! ఎందుకంటే హేతువాది నార్ల వేంకటేశ్వరరావు, ఔత్సాహిక వ్యాపారవేత్త కేఎల్ఎన్ ప్రసాద్ తదితరులు నేతృత్వంలో ప్రారంభమై.. నడిచిన ఆంధ్రజ్యోతి కాదిది…! అదే పత్రికలో రిపోర్టర్ గా పనిచేసి…ఏకంగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎదిగిన రాధాకృష్ణ వండివార్చుతున్న పసుపు పత్రిక…ఇప్పటి ఆంధ్రజ్యోతి..! దీని పనల్లా ఏపీలో అశాంతి నింపడం…అలజడి రేకెత్తించడమే..!

కరోనా పాలిటిక్స్..!

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది….కరోనాతో పెద్ద ఎత్తున్న మరణాలు సంభవిస్తున్నాయి…. కానీ, జగన్ ప్రభుత్వం వాస్తవాలను దాస్తోంది…..ఇదీ ఆంధ్రజ్యోతి, చంద్రబాబుల వరస…! దీన్ని బట్టి టీడీపీ, ఎల్లో మీడియా అమరావతి ఆందోళనల సమయంలో అమలుచేసిన వ్యూహాన్నే మళ్లీ అమలుచేస్తున్నాయని అనిపిస్తోంది. అప్పట్లో రాజధాని పరిధిలో ఏ కారణంతో చనిపోయినా దాన్ని అమరావతి ఖాతాలో వేసి రాజకీయం చేసే ప్రయత్నం జరిగింది. కానీ, అత్యంత దురదృష్టకరంగా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ఓకేతాటిపై నిలబడాల్సిన ఈ ఆపత్కాలంలోనూ శవరాజకీయాలు చేయడం నిజంగా శోచనీయం.

ఇతర రాష్ట్రాలపై మోజు….

ఏపీ చుట్టూ ఉన్న అన్ని రాష్రాలు లాక్ డౌన్ పొడిగించాయి…పకద్బబందీగా అమలుచేస్తున్నాయి…కానీ, సామాజిక వ్యాప్తి లోకి ప్రవేశించిన ఏపీ మాత్రం లాక్ డౌన్ పొడిగించకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది…..ఇదీ ఆంధ్రజ్యోతి తీరు. ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని భారత ప్రభుత్వం కంటే ముందే ఆంధ్రజ్యోతి నిర్ధారిచేసింది. తద్వారా రాష్ట్రా ప్రజల్లో అనవసర భయాలు కలిగించడంతో పాటు దేశంలో ఏపీ పరువు తీసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆంధ్రజ్యోతి చెప్పకనే చెప్తోంది.

బియ్యం పంపిణీ లోనూ…

ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తోంది. అక్కడక్కడ నాణ్యత లేని బియ్యం వస్తే…వాటి స్థానంలో తిరిగి మంచి బియ్యం పంపిణీ చేస్తోంది. కానీ, ప్రభుత్వం పై బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆంధ్రజ్యోతి…ప్రభుత్వం పంచిన బియ్యాన్ని తినలేక మురికి కాలువల్లో పడేస్తున్న జనం అంటూ కథనం అల్లేసింది. పోనీ ఈ వార్తను ఆ జిల్లాకే పరిమితం చేసిందా అంటే కాదాయే..! రాష్ట్రమంతా ఇదే తీరులో జరుగుతోంది అని ప్రజలను నమ్మించేందుకు మెయిన్లో ప్రచురించింది.

ఇకనైనా మారాలి…

ఈ ఆపత్కాలంలో రాజకీయ అంశాలు ఎలాగున్నా ప్రజలతో ముడిపడిన అంశాలపై అధికార, ప్రతిపక్ష, మీడియాలు ఓకేతాటిపైకి రావాలి. పోనీ ఒకరితో ఒకరు కలిసేందుకు ఇష్టపడకపోయినా కనీసం సంయమనం పాటించాలి. కానీ, ఏపీలో ఓ వర్గం మీడియా, ప్రతిపక్షాలు కల్పిత కథనాలు, అవాస్తవ విమర్శలతో రాష్ర్టంలో అశాంతిని, ఆందోళనను సామాజిక వ్యాప్తి చెందిస్తుండటం దురదృష్టకరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి