iDreamPost

అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపిన అమ్మఒడి – నాంది ఫౌండేషన్ సర్వే

అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపిన అమ్మఒడి – నాంది ఫౌండేషన్ సర్వే

భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరు సమానమే అయినా , పురుషాదిక్యత భావజాలం కలిగిన సమాజం కారణంగా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు ఇంటా బయట అనేక రకాలుగా వివక్షకు గురౌతూ వచ్చారు. ముఖ్యంగా విద్య విషయంలో మహిళలకు స్వేచ్చగా నిర్ణయంతీసుకునే హక్కు ఇంకా సమాజంలో పూర్తిస్థాయిలో రాలేదు అనటంలో ఏలాంటి సందేహంలేదు. మహిళల అక్షరాస్యత పేరిగితే ఏ దేశమైనా అభివృద్ది చెందుతుంది అని రాజకీయనాయకులు నిత్యం చెప్పుకుంటు వచ్చినా ఆచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు దీని ఫలితంగా మహిళలు అన్ని రంగాల్లో ఇంకా వివక్షకు గురౌతూనే ఉన్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో ముందు ఉన్నా.. మహిళల అక్షరాస్యతలో మాత్రం అనేక చిన్న రాష్ట్రాల కన్న వెనకపడే ఉందని గతంలో విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ అక్షరాస్యత 82% ఉంటే మన రాష్ట్రం 67%తో ఉండటమే హీన స్థితిలో అనుకుంటే, అందులోను మహిళల అక్షరాస్యత శాతం 59% మాత్రమే ఉండటం రాష్ట్రంలో మహిళల వెనకబాటు తనానికి నిదర్శనంగా చెప్పవచ్చు, ఈ దుస్థితికి ముఖ్య కారణం ఆడపిల్లలు ప్రాధమిక విద్య దశలొనే బడి మానివేయడంతో డ్రాప్ అవుట్స్ శాతం రాష్ట్రంలో పెరుగుతు వచ్చింది. దీనికి ముఖ్య కారణంలో ఒకటి పేదరికం, ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేకపొవడం, ప్రేయివేటు బడులు విద్యను వ్యాపారం చెసి ఉపాద్యాయుడి దగ్గరనుండి విద్యార్ధి వరకు అందరిని వ్యాపార వస్తువుగా చూడటంతో షుమారు ప్రతి ఏటా 1.5 లక్షల మంది పాటశాలలకు దూరమౌతూ వచ్చారు. ఇలా విద్యకు దూరమైన వారిలో బాలికలదే పై చేయి. ఈ పరిస్తితితో చదువుకునే ఆడపిల్లలు కుటుంభ పోషణలో భాగస్వామ్యం అవటంతో, పుస్తకం పట్టాల్సిన చేతులు పళ్లేలు కడుగుతూ బాలకార్మికులుగా మారుతు వచ్చారు. దీంతో ఆంద్ర రాష్ట్రంలో 7% మంది అనగా 13,63,339 మంది బాల కార్మికులుగా మారారు అనేది లెక్కలు చెబుతున్న చేదు నిజం.

ఆడపిల్లను బడి మానిపించటానికి దారిద్య్రం, సామాజిక అసమానతలు, ప్రాధమిక వసతుల లేమి పాఠశాలలు, భద్రతా అంటూ అనేక కారణాలు చూపిస్తున్నా , బాలికలు తిరిగి చదువుకు దగ్గర చెయటానికి సరైన ఒక్క కారణం కూడా చెప్పలేక పోవటం వారి బద్రత పట్ల గత పాలకుల్లో ఎంత నిబద్దత ఉందో అర్ధం చెసుకోవచ్చు. అయితే తాజాగా విడుదలైన ఒక సర్వే రిపొర్టు రాష్ట్రంలో బాలికల అక్షరాస్యత పట్ల కొంత ఆశాజనకమైన అంశాలను పొందుపరిచింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే తో రాష్ట్రంలో బాలికలని వారి తల్లి తండ్రుల్లో చదివించాలనే ఆశ గతంతో పొలీస్తే మెరుగ్గా ఉందనే అంశం వెలుగులోకి వచ్చింది.

ది టీన్ ఏజ్ గర్ల్స్ ప్రాజెక్ట్:

ది టీన్ ఏజ్ గర్ల్స్ ప్రాజెక్ట్ లో భాగంగా సామాజిక మానవ శాస్త్ర అద్యయన నిపుణులు, న్యాయవాదులు, మానసిక ఆరోగ్య నిపుణులతో మహింద్ర అండ్ మహింద్ర, నాంది ఫౌండేషన్ సంస్థలు దేశ వ్యాప్తంగా 600 కు పైగా 74 వేలమంది టీన్ ఏజ్ బాలికలని బాగం చేస్తు నిర్వహించిన సర్వేలో ఆంద్రప్రదేశ రాష్ట్రంలో ఆడపిల్లకు చదువుకోవాలనే ఆశతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం గతంలోకన్న పెరిగిందని చెప్పుకోచ్చింది. రాష్ట్రంలో 71 శాతం మంది ఆడపిల్లలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షిస్తునట్టు ఈ సర్వే చెప్పుకోచ్చింది. అలాగే రాష్ట్రంలో బాలికల తల్లి తండ్రుల్లో 96.6 శాతం మందికి తమ ఆడపిల్లలకు 19 ఏళ్ళ లోపు వివాహాలు చెయకుండా, చదివించాలెనే ఉద్దేశంలో ఉనట్టు సర్వే నివేదికలో పేర్కొన్నారు. అలాగే 86.6 శాతం టీనేజ్ బాలికలు 21ఏళ్ల తరువాత మాత్రమే పెళ్ళి చెసుకోవాలనే ఆలోచనతో ఉనట్టు, 69.4 శాతం మంది టీన్ ఏజ్ బాలికలు తాము చదువుకునే విద్యకు అనుగుణంగా ఉపాది పోందాలని బావిస్తునట్టు పేర్కొన్నారు.

మార్పు తెచ్చిన అమ్మ ఒడి:

రాష్ట్రంలో బాలికల విద్యకు శాపంగా ఉన్న అనేక అంశలపై సంగ్రంగా ఆలోచించి, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ప్రకటిచిన జగన్ తాను ముఖ్యమంత్రి అవ్వగానే మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగానే పాఠశాల వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టారు. పేదరికంతో పిల్లలు చదువుకు దూరం అవ్వకూడదు అనే ఉద్దేశంతో పిల్లల తల్లుల ఖాతాలో 15వేల రూపాయలు జమ చేశారు. దీంతో పిల్లలను బడికి పంపాలనే కోరిక తల్లి తండ్రుల్లో పెరిగింది. అలాగే పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలలను అభివృద్ది చేసేందుకు నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో శిధిలావస్థకు చేరిన పాఠశాలల్లో మరుగుదోడ్లు దగ్గర నుండి తరగతి గదుల నిర్మాణం వరకు అభివృద్దికి పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే బాలికలు సైతం ప్రపంచంతో పోటి పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాద్యమం ని ప్రవేశ పెట్టారు. ఇలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్శ రవేగంగా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడంతో బాలికల్లో వారి తల్లి తండ్రుల్లో ఆడపిల్లల విద్యకు ప్రాధాన్యం గతంలో కంటే మరింతగా పేరిగి దేశంలోనే మోదటి వరుసలో ఉందని నాంది సంస్థ తమ సర్వే నివేదికలో పేర్కోంది.

యువతుల్లో ఆత్మవిశ్వాసం, స్వాలంభన, స్వతంత్రత రాష్ట్రంలో గతంలో కన్న మేరుగ్గా కనపడటంతో, సమాజంలో బాలికలు ఆర్ధికంగా , సామాజికంగా ఏదగడానికి రాష్ట్ర ప్రభుత్వాం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తు. బాలికల అభ్యునోత్తకి కోత్త అవకాశాలు ప్రతి ఒక్కరు తమ భాద్యతగా స్వీకరించాలని, అప్పుడే సమాజంలో వివక్షకు గురవుతున్న యువతుల్లో అబద్రత భావం పొయి ఏదగాలన్న ఆకాంక్ష పేరుగుతుందని నాంది ఫౌండేషన్ తమ నివేదికలో పేర్కోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి