iDreamPost

కుటుంబం కోసం 9 ఏళ్లకే పనికి వెళ్లింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా సూపర్ క్రేజ్

కష్టాలకు ఎవ్వరూ కూడా అతీతులు కారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఇలాగే 9 ఏళ్లకే పనికెల్లి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

కష్టాలకు ఎవ్వరూ కూడా అతీతులు కారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. ఇలాగే 9 ఏళ్లకే పనికెల్లి ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తోంది.

కుటుంబం కోసం 9 ఏళ్లకే పనికి వెళ్లింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా  సూపర్ క్రేజ్

ఎవ్వరి జీవితంలోనైనా సక్సెస్ ఊరికే రాదు. జీవన ప్రయాణంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు ఉంటాయి. వాటన్నింటిని దాటుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. ప్రస్తుత సమాజంలో గొప్ప వాళ్లుగా కీర్తింపబడుతున్న వారంతా అలా పైకొచ్చిన వారే. కష్టాలు అనేటివి అందరికీ సమానమే. వాటికి సామాన్యులు, ధనికులు అనే తారతమ్యాలు ఉండవు. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వేస్తేనే గొప్పవాళ్లుగా మిగిలిపోతారు. ఇలా సక్సెస్ సాధించిన వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఇలాంటి ఆదర్శ వ్యక్తుల్లో సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. ఆ లిస్టులో పంజాబీ నటి కూడా ఉన్నారు.

సినిమా సెలబ్రిటీల జీవితాల్లో కూడా కన్నీటి గాథలుంటాయి. సినీ రంగంలో వారు ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ జీవితంలో వారు అనుభవించిన కష్టాలు మాత్రం మర్చిపోలేరు. ఈ క్రమంలో పంజాబీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ చిన్నతనంలోనే శక్తికి మించిన కష్టాలను అనుభవించింది. కుటుంబానికి అండగా నిలబడేందుకు 9ఏళ్ల వయసులోనే పనికెళ్లింది. కానీ ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. పంజాబీ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటూ టాప్ ప్లేస్ లో ఉంది. ఆమె మరెవరో కాదు నీరూ బజ్వా. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత టెలివిజన్‌లో నటించి, చివరికి పంజాబీ సినిమాల్లో సక్సెస్ అయ్యింది.

పంజాబీ చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా దూసుకెళ్తున్న నీరు బజ్వా తల్లిదండ్రులు పంజాబ్ నుంచి కెనడాకు వలస పోయారు. అయితే ఆమె తండ్రీ వృత్తిరీత్య వైద్యుడు. కానీ కెనడాలో లైసెన్స్ లేకపోవడంతో వైద్యవృత్తి కొనసాగించలేకపోయారు. దీంతో కుటుంబ పోషణ కష్టతరమైంది. దీంతో ఆయన ఓ గ్యాస్ స్టేషన్ లో పని చేసేందుకు సంకల్పించాడు. నీరు బజ్వా తల్లి ఓ హోటల్లో పని చేస్తుండేవారు. నీరు బజ్వా కూడా 9 ఏళ్ల వయసులో డబ్బులు సంపాదించేందుకు ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో యాక్టింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టింది.

నీరూ బజ్వా వెండి తెర అరంగేట్రం

1998లో 18 ఏళ్ల వయస్సులో దేవ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన “మెయిన్ సోలహ్ బరాస్ కి ” ద్వారా నీరూ బజ్వా వెండి తెర అరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత టీవీషోలో నటించింది. నీరూ బజ్వా 2007లో “హాల్లా గల్” చిత్రంతో పంజాబీ సినిమాల్లోకి అడుగుపెట్టి ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో ఆమె లక్ మారిపోయింది. చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఆ తర్వాత “జట్ & జమీలా”, “యారా దిల్దారా”, “మేలే గుర్ కియాన్” వంటి అనేక హిట్స్ అందుకుంది. 42 ఏళ్ల వయస్సులోనూ నీరూ బజ్వా పంజాబీ సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తూ అత్యధిక పారితోషికాన్ని అందుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి