iDreamPost

అంబానీ గొప్ప మనసు.. జంతువుల కోసం 3 వేల ఎకరాల్లో

  • Published Feb 27, 2024 | 2:21 PMUpdated Feb 27, 2024 | 2:51 PM

మరికొన్ని రోజుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త భారత కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అంబానీది గొప్ప మనసు అంటూ కొనియాడుతున్నారు.

మరికొన్ని రోజుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త భారత కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అంబానీది గొప్ప మనసు అంటూ కొనియాడుతున్నారు.

  • Published Feb 27, 2024 | 2:21 PMUpdated Feb 27, 2024 | 2:51 PM
అంబానీ గొప్ప మనసు.. జంతువుల కోసం 3 వేల ఎకరాల్లో

ప్రముఖ పారిశ్రామికవేత్త భారత కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలా కుమారుడు అనంత్ అంబానీ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈయన రాధికా మర్చంట్ ను త్వరలో వివాహం చేసుకుబోతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభమైంది. అలాగే ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు 5 స్టార్ హోటల్ కు మించిన సౌకర్యాలను ముఖేష్ అంబానీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహ వేడుకకు ముందు..  అంబానీ ఫ్యామిలీ రిలయన్స్ ఫౌండేషన్ పేరిట ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం తెలిసిన నెటిజన్స్.. అంబానీది గొప్ప మనసు అంటూ కొనియాడుతున్నారు.

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పుడు జంతు సంరక్షణ కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం గుజరాత్ జామ్‌ నగర్‌ లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కేంద్రం జామ్‌ నగర్‌ లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌ లో సుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స చేయడమే కాకుండా.. వాటి సంరక్షణ కోసం పునరావాసం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ఆలోచన వెనుక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఉన్నారు. పైగా ఇది ఆయన ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డుతో సహా.. రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో సాధ్యమైందని తెలిపారు.

అయితే, ఇది వంతారా అనే కృత్రిమ అడవి అని, ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ రీతిలో.. వసతి ఏర్పాట్లు చేశారు. ఈ 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అడవిలో.. ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండటం విశేషం. పైగా పోర్టబుల్ X-Ray యంత్రాలు, శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు, అత్యాధునిక సదుపాయాలు కూడా ఈ అడవిలో ఉన్నాయి. కాగా, వంతారా ప్రారంభించిన సందర్భంగా.. అనంత్ అంబానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్నప్పటి నుంచే జంతువుల్ని కాపాడే అలవాటు ఉండేదని.. అందుకే ఇప్పుడు వంతారా అడవిని నిర్మించినట్లు పేర్కొన్నారు. భారత్‌ లో అంతరిస్తున్న జంతు జాతుల్ని సంరక్షించడమే తమ లక్ష్యం అని వివరించారు. పైగా ఇందులో భారత్ తో సహా అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జంతు శాస్త్ర నిపుణులు, వైద్య నిపుణులు కూడా ఈ మిషన్ లో భాగమయ్యారని తెలిపారు.

అలాగే రాధాకృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా భారతదేశం అంతటా దాదాపు 200కు పైగా ఏనుగుల్ని కాపాడినట్లు అనంత్ అంబానీ అన్నారు. వంతారా అనేది కేవలం జూ మాత్రమే కాదని.. ఇదొక సేవాలయం అని అన్నారు. ఇక్కడ గణేశుడు ఏనుగుల రూపంలో ఉంటాడని తాను నమ్ముతానని.. అందుకే గణేశుడ్ని పూజించే ఉద్దేశంతోనే ఏనుగులకు సేవ చేస్తానని అనంత్ అంబానీ అన్నారు. ఇక రాధికా మర్చంట్‌ కు కూడా వంతారా అంటే చాలా ఇష్టమని.. వీలైనంత ఎక్కువ సమయం అక్కడ గడిపేందుకు ఆసక్తి చూపిస్తుందని అనంత్ అంబానీ చెప్పారు. మరి, జంతువుల కోసం ఇంత గొప్పగా ఆలోచించి వాటి కోసం అడవిని ఏర్పాటు చేసిన అంబానీ ఫ్యామిలీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి