iDreamPost

Amazon Prime:సబ్‌స్క్రైబర్లకు షాక్‌.. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నా ఎక్స్‌ట్రా డబ్బులు కట్టాల్సిందే!

  • Published Dec 29, 2023 | 12:36 PMUpdated Dec 29, 2023 | 12:36 PM

ఇప్పటివరకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ కు వినియోగదారులు ఎంతగానో అలవాటు పడి ఉన్నారు. వాటికోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ తాజాగా ఒక ప్రకటన చేసింది.

ఇప్పటివరకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ కు వినియోగదారులు ఎంతగానో అలవాటు పడి ఉన్నారు. వాటికోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని మరీ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ ఆన్ లైన్ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ తాజాగా ఒక ప్రకటన చేసింది.

  • Published Dec 29, 2023 | 12:36 PMUpdated Dec 29, 2023 | 12:36 PM
Amazon Prime:సబ్‌స్క్రైబర్లకు షాక్‌.. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నా ఎక్స్‌ట్రా డబ్బులు కట్టాల్సిందే!

ప్రస్తుతం అంతటా ఓటీటీ హవా నడుస్తోంది. ఎంత థియేటర్ లో చిత్రాలు విడుదల అయినా సరే, అవి ఓటీటీ లోకి వచ్చి తీరాల్సిందే. థియేటర్ లో సినిమాలు మిస్ అయిన వారు చక్కగా ఓటీటీ లో మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని భాషల చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నీ ఓటీటీ లో ప్రసారం చేస్తున్నారు. కొంతమంది మూవీ మేకర్స్ కూడా ఇలా ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఓటీటీకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఓటీటీ సంస్థలు కూడా మూవీస్ ను వెంటనే కొనుగోలు చేసుకుంటూ ఆయా ప్లాటుఫార్మ్స్ యొక్క వినియోగదారులను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఓ వార్త తెలియజేసింది.

సాధారణంగా చాలా వరకు ఓటీటీ లలో.. చిత్రాలు ప్రసారం అయ్యే సమయంలో ఎటువంటి వాణిజ్య ప్రకటనలు రావు. కానీ, ఇక నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు సినిమాలతో పాటు ప్రకటనలను కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే, 2024 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రకటనలు ఉంటాయని.. తాజాగా ఆ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. కానీ, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ తో పోలిస్తే.. వీరి ప్లాట్ ఫార్మ్ లో ప్రకటనలు తక్కువగా ఉంటాయన్న విషయాన్నీ కూడా హైలైట్ చేస్తూ.. ఈ విషయాన్నీ తెలియజేసింది. అయితే , ప్రకటనలు చూడదలచుకోని వారు దానికోసం అదనంగా $2.99 ​​(సుమారు రూ. 250) చెల్లించవచ్చని వెల్లడించింది.

కాగా, వారు వెల్లడించిన వివరాల ప్రకారం 2024 జనవరి 29 నుంచి US,UK మరియు కెనడా దేశాలలో.. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఈ ప్రకటనలు కనిపిస్తాయి. కానీ, ఇండియాలో కూడా అదే తేదీ నుంచి దీనిని అమలు చేస్తారా లేదా అనే విషయంపైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికొస్తే.. ఈ ప్లాట్ ఫార్మ్ మంచి పిక్చర్ క్వాలిటీతో చిత్రాలను, వెబ్ సిరీస్ ను ప్రసారం చేస్తుంది. వినియోగదారులు చెల్లించే సబ్స్క్రిప్షన్ ను బట్టి.. వారు స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, టీవీ ఇలా అన్ని డివైస్ లకు యాక్సెస్ లభిస్తుంది. పైగా ఒక యూజర్ చెల్లించిన సబ్స్క్రిప్షన్ తో.. నలుగురు ఐదురుగురు మెంబర్స్ ఒకేసారి వేరే వేరే డివైస్ లలో దీనిని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఇక నుంచి యాడ్ ఫ్రీ స్ట్రీమింగ్ చూడాలంటే అదనంగా $2.99 చెల్లించాల్సి వస్తుంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి