iDreamPost

యూజర్లకు అమెజాన్ ప్రైమ్ బిగ్ షాక్.. సబ్​స్క్రిప్షన్ తీసుకున్నా..!

  • Author singhj Published - 08:19 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 08:19 PM, Sat - 23 September 23
యూజర్లకు అమెజాన్ ప్రైమ్ బిగ్ షాక్.. సబ్​స్క్రిప్షన్ తీసుకున్నా..!

ఇప్పుడు ఓటీటీల జమానా నడుస్తోంది. మూవీస్, వెబ్ సిరీస్​లు, క్రికెట్ మ్యాచులు ఇలా ఒక్కటేంటి? మొత్తం ఎంటర్​టైన్​మెంట్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్నే ఓటీటీలు మార్చేశాయి. కరోనా టైమ్​లో ఓటీటీలకు ఆడియెన్స్ బాగా అలవాటు పడ్డారు. భారతీయ చిత్రాలతో పాటు ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఫారెన్ సినిమాలు, వెబ్ సిరీస్​లను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఓటీటీల హవా ఇంకా కొనసాగుతోంది. అయితే అంతా పెయిడ్ సర్వీసులే. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్​స్టార్, నెట్​ఫ్లిక్స్, సోనీలివ్, ఆహా, ఈటీవీ విన్ లాంటి ఓటీటీ వేదికలు నెల, వార్షిక చందాలు తీసుకున్న వారికి ప్రీమియం కంటెంట్​ను అందిస్తున్నాయి. ఇప్పుడు జియో ఒక్కటే ఫ్రీగా కంటెంట్​ను ఇస్తోంది.

యూజర్లను ఆకర్షించేందుకు కొంతకాలం వరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్​లను అందించిన ఓటీటీ వేదికలు నెమ్మదిగా అటువైపు అడుగులు వేస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా హాట్​స్టార్ బాట పట్టనుందని సమాచారం. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఏదైనా సినిమా, సిరీస్ చూడటం మొదలుపెట్టగానే ఒక యాడ్ వస్తోంది. దీన్ని స్కిప్ చేస్తే వీడియో పూర్తయ్యే వరకు ఎలాంటి యాడ్ రాదు. కానీ ఇక మీదట పరిమిత సంఖ్యలో ప్రకటనలను ప్రసారం చేయాలని అమెజాన్ భావిస్తోందట. యూఎస్​తో పాటు పలు దేశాల్లో ఉన్న ప్రైమ్ సబ్​స్క్రైబర్స్ సినిమా చూడాలంటే యాడ్స్​ను కూడా భరించాల్సిందే. దీన్ని వచ్చే ఏడాది అమలు చేయాలని భావిస్తోందని తెలుస్తోంది.

ఒకవేళ అమెజాన్ ప్రైమ్​లో యాడ్స్ లేకుండా కంటెంట్ చూడాలనుకుంటే మాత్రం అదనంగా మరికొంత రుసుము చెల్లించాలట. అంటే ఇది ప్రైమ్ మెంబర్​షిప్​కు అదనం. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ రూపంలో ప్రైమ్ సబ్​స్క్రైబర్స్​కు తెలియజేస్తుందట. డిస్నీ ప్లస్ హాట్​స్టార్ వార్షిక చందా రూ.899 ఉండగా.. యాడ్ ఫ్రీ కంటెంట్ పొందాలంటే సూపర్ ప్లస్ ప్లాన్ కింద రూ.1,099 ఎంచుకోవాలి. ఇకపై ప్రైమ్ కూడా ఇదే విధంగా యూజర్లపై మరింత భారం మోపేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై ప్రైమ్ యూజర్లు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం అదనంగా డబ్బులు వసూలు చేయాలనుకోవడం సరికాదంటున్నారు.

ఇదీ చదవండి: బ్రాహ్మణి వైపు తమ్ముళ్ల చూపు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి