iDreamPost

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు షాక్.. ఇకపై రీప్లేస్ మెంట్ కావాలంటే అలా చేయాల్సిందే!

ఆన్ లైన్ లో వస్తువులు కొనే వారికి బిగ్ షాక్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ అండ్ రీ ప్లేస్ మెంట్ పాలసీలో మార్పులు చేశాయి. ఇప్పుడు మీరు రీప్లేస్ మెంట్ చేయాలంటే అలా చేయాల్సిందే.

ఆన్ లైన్ లో వస్తువులు కొనే వారికి బిగ్ షాక్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిటర్న్ అండ్ రీ ప్లేస్ మెంట్ పాలసీలో మార్పులు చేశాయి. ఇప్పుడు మీరు రీప్లేస్ మెంట్ చేయాలంటే అలా చేయాల్సిందే.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు షాక్.. ఇకపై రీప్లేస్ మెంట్ కావాలంటే అలా చేయాల్సిందే!

ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే సంబంధింత షాపులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీలో పెరగడంతో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చాలా మంది ఆన్ లైన్ లో రెగ్యూలర్ గా తమకు వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కూర్చున్న చోటునుంచే ఏ వస్తువు కావాలో దాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుని పొందుతున్నారు. ఈ ఆన్ లైన్ సేవల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు దూసుకెళ్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించి సేల్స్ ను పెంచుకుంటున్నాయి. కాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో వస్తువులు కొనే వారికి బిగ్ షాక్ ఇస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు. ఈ రెండు సంస్థలు డిజిటల్ రిటర్న్ అండ్ రిప్లేస్ మెంట్ పాలసీలో భారీ మార్పులు చేశాయి. దీంతో ఇకపై రీప్లేస్ మెంట్ ఆటలు సాగవంటున్నాయి సంబంధిత వర్గాలు.

7 డేస్ సర్వీస్ సెంటర్ రీప్లేస్ మెంట్ పాలసీ

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ సంస్థల్లో వస్తువులు కొన్నప్పుడు అవి మీకు నచ్చకపోయినా లేదా డ్యామేజ్ అయినా, లేదా ఫంక్షనింగ్ సరిగా లేకున్నా రీప్లేస్ మెంట్ చేసుకునే వారు. ఇదివరకు వస్తువు కొన్న తర్వాత ప్రాబ్లం వస్తే 7 డేస్ పాలసీని అందించేవి. 7 రోజుల్లో రీప్లేస్ మెంట్ జరిగేది. దీని వల్ల కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నాయి. అదనపు ట్రాన్స్ పోర్టు ఛార్జీలు, కొంత వరకు ఫ్రాడ్ జరుగుతుండడంతో ఈ పాలసీలో మార్పులు తీసుకొచ్చాయి. ఈ రెండు కంపెనీలు తమ ప్లాట్‌ఫారమ్‌లను 7 రోజుల రీప్లేస్‌మెంట్ నుండి 7 రోజుల సర్వీస్ సెంటర్ రీప్లేస్‌మెంట్‌కి మార్చాయి. ఇప్పుడు రిటర్న్ అండ్ రీప్లేస్ మెంట్ పాలసీలో మార్పుల వల్ల ఇకపై మీరు కొనుగోలు చేసిన వస్తువును వెంటనే మార్చలేరు. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు.. యూజర్లు తమ వస్తువులను మార్చుకోదలిస్తే సర్వీస్ సెంటర్ ల ద్వారానే చేసుకునే విధంగా మార్పులు చేశాయి.

మీరు డ్యామేజ్ అయిన వస్తువును మార్చాలనుకుంటే సర్వీస్ సెంటర్ ను సందర్శించి అక్కడ వస్తువును ఇవ్వాలి. అక్కడ వస్తువును పరిశీలించిన తర్వాత రిపేర్ చేయడమో లేదా రీ ప్లేస్ మెంట్ కోసం కంపెనీకి పంపించడమో చేస్తారు. అంతేగాని మీరు డైరెక్ట్ గా వస్తువును ఈ కామర్స్ సంస్థలకు పంపిచలేరు. కొత్త ప్రోడక్ట్‌ వచ్చే వరకు ఈ సర్వీస్ సెంటర్లను సందర్శించాల్సి ఉంటుంది. మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్‌లు కొనుగోలు చేస్తే, మీ సమీపంలోని సర్వీస్ సెంటర్ లొకేషన్ గురించి సమాచారాన్ని పొందాలి. వస్తువులో ఏవైనా సమస్యలు ఉన్నట్లైతే వెంటనే ఈ సర్వీస్ సెంటర్లలో కంప్లైంట్ చేయొచ్చు. అయితే అమెజాన్ లో ఈ విధానం జేబీఎల్, గూగుల్, ఆపిల్ కు చెందిన వస్తువలకు మాత్రమే 7 డేస్ సర్వీస్ సెంటర్ రీప్లేస్ మెంట్ పాలసీని అమలు చేస్తున్నారు. మీరు ఈ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసినట్లైతే వాటిని మార్చుకోదల్చుకుంటే సర్వీస్ సెంటర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి