iDreamPost

అల్లు అర్జున్‌‌కి దక్కిన మరో అరుదైన గౌరవం!

  • Published Feb 16, 2024 | 10:31 AMUpdated Feb 16, 2024 | 10:31 AM

Rare Honor for Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యానరిజమ్స్ తో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.. తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Rare Honor for Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మ్యానరిజమ్స్ తో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు.. తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

  • Published Feb 16, 2024 | 10:31 AMUpdated Feb 16, 2024 | 10:31 AM
అల్లు అర్జున్‌‌కి దక్కిన మరో అరుదైన గౌరవం!

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింత్ వారసుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకున్నా.. తర్వాత వచ్చిన ఆర్య, బన్ని, దేశ ముదురు ఇలా వరుస హిట్స్ తో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్, నటన అన్నింటిలోనూ అల్లు అర్జున్ ది ఒక ప్రత్యేక స్టైల్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో బన్నీ ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నాడు బన్ని. తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళ్తే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. ఈ అవార్డు 2023 అక్టోబర్ 16న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీలో నటించాడు. ఈ మూవీ బన్నీకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. పుష్ప జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. రష్యా, యూఎస్ఏ, గల్ఫ్, ఆస్ట్రేలియా, యూకే లతో పాటు పలు దేశాల్లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులో సన్నివేశాలు, డైలాగ్స్, పాటలు ఇప్పటికీ కొంతమంది క్రీడాకారులు, సెలబ్రెటీలు రీల్స్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పుష్ప: ది రూల్ సెకంట్ పార్ట్ రెడీ అవుతుంది.

Another rare record in Allu Arjun's account

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జర్మనీ వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 వరకు జర్మనీలో జరుగుతున్న 74 వ బెర్లిన్ ఫిలిమ్ ఫెస్టివల్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా అల్లు అర్జున్ కి ఆహ్వానం వచ్చింది. ఈ చిత్రోత్సవంలో బన్నీ భారతీయ సినీ ప్రాముఖ్యత, చరిత్ర గురించి మాట్లడబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫెస్టివల్ లో పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ ప్రత్యేక ప్రదర్శన కూడా ఉంబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ బెర్లిన్ ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సినీ ప్రముఖులను కలవబోతున్నారు. తాజాగా బన్నీ బెర్లిన్ బయలుదేరుతూ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి