iDreamPost

Bheemla Nayak : అందరి చూపు పవన్ సినిమా వైపు

Bheemla Nayak : అందరి చూపు పవన్ సినిమా వైపు

పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం భీమ్లా నాయక్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. సెన్సార్ కూడా జరిగిపోతోందన్న వార్త సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది. దానికి తోడు నిర్మాణ సంస్థ సితార నిన్నో కొత్త ఫోటోతో త్వరలోనే రిలీజ్ డేట్ తో కూడిన వీడియో అప్ డేట్ ఇస్తామని ప్రకటించడం ఆసక్తిని పెంచింది. దీంతో ఫిబ్రవరి 25న పవర్ స్టార్ రావడం ఖాయమనే అంచనాతో ఉన్నారు. ఇది నిజమో కాదో ఇంకొద్ది గంటల్లోనే తేలిపోయే అవకాశం ఉంది. ఏపిలో ఆంక్షలకు సంబంధించి క్లారిటీ వచ్చే సూచనలు ఉండటంతో దానికి తగట్టు సిద్ధంగా ఉండేలా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారట. సో నమ్మొచ్చు.

ఒకవేళ భీమ్లా నాయక్ 25న వస్తే వసూళ్ల సునామి ఖాయం. అసలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా జోష్ లేదు. అంత కరువు ఉంది కాబట్టే టైం పాస్ కామెడీగా పేరు తెచ్చుకున్న డీజే టిల్లుకు భారీ వసూళ్లు వస్తున్నాయి. అలాంటిది పవన్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ వంద కోట్లు దాటిందన్న వార్త ట్రేడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమంత పెద్ద మొత్తం కాదు. అందులోనూ హిందీ డబ్బింగ్ కూడా రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి పుష్ప తరహాలో రెవిన్యూ భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే అయ్యప్పనుం కోషియం బాలీవుడ్ రీమేక్ కు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.

కరోనా ఆల్రెడీ తగ్గిపోయింది. అన్ని చోట్లా కేసులు నమోదవుతున్నాయి కానీ మరీ భయపెట్టే స్థాయిలో లేదు. ఎక్కడా ప్రమాదకర స్థితిలో హాస్పిటల్ అడ్మిషన్లు లేవు. వ్యాక్సినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సినిమా హాళ్లకు జనం వస్తున్నారు. వాటికి వచ్చేందుకే జంకుతున్న దాఖలాలు లేవు. సో భీమ్లా నాయక్ కు ఈ అంశాలన్నీ కలిసి వస్తాయి. మళ్ళీ మార్చ్ 10 నుంచి సూర్య ఈటి, 11న రాధే శ్యామ్, 17 జేమ్స్, 25 ఆర్ఆర్ఆర్ ఉంటాయి కాబట్టి ఆలోగా భీమ్లా నాయక్ మాగ్జిమమ్ రాబట్టుకుంటాడు. ఒకవేళ నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటే మాత్రం ఏప్రిల్ 1 దాకా వెయిట్ చేయక తప్పదు. ఇది తేలితే కానీ వరుణ్ తేజ్ గని డేట్ ని ఫిక్స్ చేయలేరు

Also Read : Sarkaru Vaari Paata : సోషల్ మీడియాలో సర్కార్ ప్రకంపనలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి