iDreamPost

హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్‌ అలెర్ట్‌.. మూడు రోజుల పాటు ఆంక్షలు!

హైదరాబాద్‌ ప్రజలకు ట్రాఫిక్‌ అలెర్ట్‌.. మూడు రోజుల పాటు ఆంక్షలు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో ట్రాఫిక్‌ మరీ విపరీతంగా ఉంటుంది. వినాయక నిమజ్జనం, బోనాల జాతరల సమయంలో ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ట్రాఫిక్‌  ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇక, సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలోనే అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  ఈ బోనాల జాతర శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు మొదలయ్యాయి. కర్బలా మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్ పేట్ ఓల్డ్ పీఎస్, ప్యారడైజ్, సీటీఓ, ప్లాజా, ఎస్‌బీఐ క్రాస్ రోడ్, వైఎమ్‌సీఏ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ క్రాస్ రోడ్, ప్యాట్నీ క్రాస్ రోడ్, పార్క్ లైన్, బాటా, ఘస్మండి క్రాస్ రోడ్, రసూర్ పూరా రోడ్లు, జంక్షన్ల ఏరియాల్లో ఆంక్షలు ఉన్నాయి. ఇటు వైపు వాహనదారులు ఎవ్వరూ రావొద్దని ట్రాఫిక్‌ అధికారులు సూచించారు.

అంతేకాదు! టబాకో బజార్, హిట్ స్ట్రీట్ వైపు నుంచి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారుల్లో వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. బాటా క్రాస్ రోడ్డు నుంచి పాత రాంగోపాల్ పేట పీఎస్, సికింద్రాబాద్ వరకు సుబాష్ రోడ్డులో కూడా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను చిలకలగూడ ఎక్స్ రోడ్, గాంధీ హాస్పిటల్-ముషీరాబాద్ ఎక్స్ రోడ్-కవాడిగూడ-మారియట్ హోటల్-ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించనున్నారు. వీటితో పాటు పలు ఏరియాల్లోనూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి