iDreamPost

Naa Samiranga: నా సామిరంగపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. స్టోరీ చెప్పేశాడుగా!

సంక్రాంతి బరిలోకి అక్కినేని నాగార్జున వచ్చేందుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగ్ కామెంట్స్ సినిమా అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.

సంక్రాంతి బరిలోకి అక్కినేని నాగార్జున వచ్చేందుకు కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగ్ కామెంట్స్ సినిమా అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.

Naa Samiranga: నా సామిరంగపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. స్టోరీ చెప్పేశాడుగా!

సంక్రాంతి సంబరాలు అప్పుడే షురూ అయిపోయాయి. జనవరి 12న రెండు చిత్రాలు బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం, తేజా సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హునుమాన్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇంకా ఈ సంక్రాంతి బరిలో రెండు సినిమాలు మిగిలే ఉన్నాయి. జనవరి 13న విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. జనవరి 14న అక్కినేని నాగార్జున- ఆషికా రంగనాథ్ జంటగా నటించిన నా సామిరంగ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించి కింగ్ నాగార్జున కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంక్రాంతి బరిలో ఉన్న అన్ని సినిమాలపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలకు కూడా తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సూపర్ హీరో సినిమా హునుమాన్ కు మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. తేజా సజ్జ- ప్రశాంత్ వర్మ ఖాతాల్లో మరో హిట్ చేరిపోయింది. మరోవైపు గుంటూరు కారం మూవీ మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రెండు సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇంకా రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. సైంధవ్ కు సంబంధించి కూడా ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి మంచి ఎక్స్ పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంక నా సామిరంగ గురించి కూడా సినీ వర్గాల్లో మంచి బజ్ అయితే ఉంది.

ఇప్పుడు కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ తో ఆ బజ్ మరింత పెరిగింది. నాగ్ మాట్లాడుతూ కథలో ఉండే కీ పాయింట్ అయితే చెప్పేశారు. ఈ మూవీ కంప్లీట్ లవ్ స్టోరీ అని చెప్పారు. అది కూడా ఎంతో కొత్తగా ఉండబోతోంది అన్నారు. ఇందులో హీరో- హీరోయిన్ 12 ఏళ్ల వయసులో ప్రమలో పడతారట. ఆ తర్వాత మళ్లీ 15 ఏళ్లు కలుసుకోరని వెల్లడించారు. అంతేకాకుండా ఈ మూవీపై నాగార్జున మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ 5 నెలలు చేశారట. షూటింగ్ మాత్రం కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. అంతేకాకుండా నాగార్జున పార్ట్ ని కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేశారు. అలాగని ఇది చిన్న సినిమా అనుకోకండని క్లారిటీ ఇచ్చారు. ఇందులో చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉందని చెప్పారు. అలాగే ఈ మూవీ ఇంత త్వరగా పూర్తి కావడానికి ప్రధాన కారణం కీరవాణి వెల్లడించారు. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ మొత్తం షూటింగ్ కి ముందే పూర్తి చేశారట.

నా సామిరంగ స్టోరీలో ప్రేమ, స్నేహం, త్యాగం, ద్వేషం అనే ప్రధానమైన భావోద్వేగాలు కథకు నాలుగు పిల్లర్స్ లా ఉంటాయట. ఈ సినిమాకి నా సామిరంగ అని టైటిల్ పెట్టడానికి కారణం.. హీరో ఊతపదం అదేనట. అందుకే ఈ మూవీకి ఆ ఊతపదాన్నే టైటిల్ గా పెట్టేశారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా ఉంది. అయితే సినిమా మొత్తం 2 గంటల 35 నిమిషాలు తీశారట. ఆ 15 నిమిషాలు కట్ చేయడానికి చాలా కష్టపడినట్లు తెలిపారు. మొత్తానికి నాగార్జున చేసిన వ్యాఖ్యలతో నా సామిరంగ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే. మరి.. నాగార్జున వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి