iDreamPost

కొత్త చీఫ్ సెలక్టర్ టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడా? అగార్కర్ ముందు 5 సవాళ్లు!

  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 5 July 23
  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 5 July 23
కొత్త చీఫ్ సెలక్టర్ టీమిండియాకు వరల్డ్ కప్ అందిస్తాడా? అగార్కర్ ముందు 5 సవాళ్లు!

2023 వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు ఉన్న అతి పెద్ద సమస్య చీఫ్ సెలక్టర్ గా ఎవరిని నియమించాలి? మాజీ ప్లేయర్లు, క్రీడా దిగ్గజాలు ఎంతో మంది పేర్లను సూచించారు. కానీ టీమిండియా చీఫ్ సెలక్టర్ గా ఊహాగానాలు వినిపించిన పేరే చివరికి తెరపై కనిపించింది. అవును భారత క్రికెట్ జట్టు కొత్త చీఫ్ సెలక్టర్ గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక తనకు అప్పగించిన గురుతర బాధ్యతను అగార్కర్ ఎలా నిర్వర్తిస్తాడు? ప్రస్తుతం అగార్కర్ ఎదురుగా ఉన్న ఆ 5 సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు? అన్న విషయాలను ఇప్పుడు చర్చిద్దాం.

గత కొంతకాలంగా టీమిండియా సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా ఓడిపోవడంతో.. ఈ విమర్శలు ఇంకా తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి ఎవరిని వరిస్తుందా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తెర దించుతూ.. బీసీసీఐ భారత క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ ను నియమించింది. 2023 వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పుడు అజిత్ అగార్కర్ ముందు 5 సవాళ్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. టీమిండియా నెక్ట్స్ కెప్టెన్ ఎవరు?

అజిత్ అగార్కర్ ముందు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది మెుదటిది. ప్రస్తుతం సారథిగా కొనసాగుతన్న రోహిత్ శర్మకు వయసు మీదపడుతోంది. రోహిత్ ఏజ్ అతడి ఫిట్ నెస్ పై.. అలాగే అతడి ఫామ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదీకాక ఇప్పటికే 2023 వరల్డ్ కప్ రోహిత్ కు చివరి వరల్డ్ కప్ గా చర్చ కొనసాగుతోంది. ఈక్రమంలో నెక్ట్స్ టీమిండియా కెప్టెన్ ఎంపిక చేయడం అగార్కర్ ముందు ఉన్న అతి పెద్ద సమస్య. యువ క్రికెటర్లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని మాజీలు సూచిస్తున్నారు. మరి అగార్కర్ ఏం చేస్తాడో వేచి చూడాలి.

2. ఆటగాళ్ల వర్క్ లోడ్

చీఫ్ సెలక్టర్ గా క్రికెటర్ల పనిభారాన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని. ఇక రాబోయే కాలంలో టీమిండియా ఎన్నో సిరీస్ లను, టోర్నీలను ఆడాల్సి ఉంది. అదీకాక మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన అగార్కార్ వీటిని ఎలా అధిగమిస్తాడో అని అందరు వేచి చూస్తున్నారు. బలమైన, ఫిట్ గా ఉండే భారత జట్టును తీర్చిదిద్దటం ఇప్పుడు అగార్కర్ ముందు ఉన్న సవాల్. మరి దీనిని అతడు ఎలా అధిగమిస్తాడో చూడాలి.

3. టీ20 జట్టును రెడీ చేయడం

ఈ ఏడాది అంతా వరల్డ్ కప్ టోర్నీతోనే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చే సంవత్సరం అంటే 2024లో టీ20 వరల్డ్ కప్ రాబోతోంది. ఈ పొట్టి ప్రపంచ కప్ కోసం ఇప్పటి నుంచే యంగ్ టీమిండియాను రెడీ చేయడం అగార్కర్ కు మరో పెద్ద సవాల్. అయితే ప్రస్తుతం టీమిండియాలో ఎంతో మంది నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఎక్కువ నైపుణ్యం కలిగిన ప్లేయర్స్ ను ఎంపిక చేయడమే అజిత్ పని. అయితే ఈ పని అంత సులువైందేమీ కాదు. ఎందుకంటే.. ఐపీఎల్ పుణ్యమాని టీమిండియాలోకి ఎంతో మంది టాలెంటెడ్ ఆటగాళ్లు వస్తున్నారు. వారిలోంచి ఓ బలమైన టీ20 జట్టును తయ్యారు చేయడం అంటే అగార్కర్ కు కత్తిమీద సామే.

4. జట్టులో మార్పులు.. చేర్పులు

ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, ధావన్ లాంటి ఎందరో సీనియర్స్ ఉన్నారు. వీళ్లు ఇప్పుడు తమ కెరీర్ చివరిదశలో ఉన్నారు. ఈ వరల్డ్ కప్ తర్వత టీమిండియాలో చాలా మంది ఆటగాళ్ల స్థానంలో యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. దానికి కోసం అజిత్ అగార్కర్ ఇప్పటి నుంచే వ్యూహాన్ని రచించాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడికి ఎన్నో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఈ ఇబ్బందులను అతడు ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి.

5. వరల్డ్ కప్ 2023, ఆసియా కప్ లకు జట్ల ఎంపిక

చీఫ్ సెలక్టర్ గా అజిత్ అగార్కర్ ముందు ఉన్నఅతి పెద్ద సవాల్.. ఆసియా కప్, వరల్డ్ కప్ 2023 టోర్నీలకు జట్లను ఎంపిక చేయడమే. ఈ రెండు మెగా టోర్నీలకు టీమ్ ను ఎంపిక చేయడం ఎంతో కఠినమైన విషయం. ఈ రెండు టోర్నీల్లో పాల్గొనే జట్లు, వారి భవితవ్యం ఆజిత్ చేతుల్లోనే ఉంది. ఇక ఈ ఐదు సవాళ్లను అజిత్ అగార్కర్ ఎలా ఎదుర్కొంటాడో అని క్రీడా పండితులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి