iDreamPost

AHA’s Bloody Mary బ్లడీ మేరీ రిపోర్ట్

AHA’s Bloody Mary బ్లడీ మేరీ రిపోర్ట్

వెబ్ సినిమాలను ప్రత్యేకంగా నిర్మించే ట్రెండ్ వచ్చాక ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వీటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పేరున్న దర్శకులు ముందుకు రావడంతో థియేటర్ లో రిస్క్ అనిపించే కాన్సెప్ట్స్ ని స్మార్ట్ స్క్రీన్ కోసం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చిందే బ్లడీ మేరీ. నివేత పేతురాజ్ టైటిల్ పోషించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని ఆహా గట్టిగానే ప్రమోట్ చేసింది. ప్రత్యేకంగా ఈవెంట్ కూడా చేయడంతో జనాల దృష్టి దీని మీదకు మళ్లింది. నిన్న బాక్సాఫీస్ వద్ద కెజిఎఫ్ 2 మేనియా నడుస్తున్న తరుణంలో అర్ధరాత్రి నుంచి బ్లడీ మేరీని స్ట్రీమింగ్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. మరి ఇది అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

కథ విషయానికి వస్తే మేరీ(నివేత పేతురాజ్)అనాథ. లెన్స్ వాడకపోతే కళ్ళు కనిపించని జబ్బు ఉంటుంది. తనతో పాటు మూగవాడైన బాషా (కిరిటీ), చెవిటివాడైన రాజు(రాజ్ కుమార్)కలిసే ఉంటారు. ముగ్గురికి లోపాలు ఉన్నా వేర్వేరు లక్ష్యాలు ఉంటాయి. వాటి కోసం కష్టపడుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఓ డాక్టర్ ని మేరీ హత్య చేయాల్సి వస్తుంది. అంతేకాదు మరో మర్డర్ తో కూడా ముగ్గురికి లింక్ పడుతుంది. దీంతో వీళ్ళను వెంటాడుతాడు ఎస్ఐ ప్రభాకర్(అజయ్). అసలు వీళ్లంతా ఈ కేసులో ఎలా ఇరుక్కున్నారు, ఫైనల్ గా బయటపడ్డారా లేక అనేది చూడాలి. కేవలం గంటన్నర నిడివి కాబట్టి టైం పెద్దగా ఖర్చు కాకపోవడం ప్లస్ పాయింట్.

కార్తికేయతో థ్రిల్లర్స్ ని బాగా హ్యాండిల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న చందూ మొండేటి ఈ బ్లడీ మేరీకి దర్శకుడు. పాయింట్ లో నవ్యత ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మరీ గ్రిప్పింగ్ గా లేకపోవడంతో ఏదో అలా అలా వెళ్ళిపోతోందనిపిస్తుంది తప్ప మరీ ప్రత్యేకంగా నిలవదు. పైగా సీరియస్ థీమ్ లో కొన్ని సోషల్ ఇష్యూస్ ని ఇరికించాలని చూసిన ప్రయత్నం కూడా అంతగా ఫలించలేదు. సెకండ్ పార్ట్ ని ముందే డిసైడ్ చేసుకున్నారు కాబట్టి క్లైమాక్స్ కొంత అసహజంగా అనిపించినా ఓవరాల్ గా ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులకు వన్ టైం వాచ్ గా చెప్పుకోవచ్చు. కాకపోతే పూర్తి స్టోరీని రెండున్నర గంటల్లో చూపిస్తే సరిపోయేది కానీ నిర్మాత ఆలోచన వేరుగా ఉంది మరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి