iDreamPost

పెంపుడు కుక్క చనిపోతే.. మరో కుక్కను తెచ్చుకుంటాం.. కానీ ఈ అమ్మాయి ఏకంగా ఏం చేసిందో చూడండి

పెంపుడు కుక్క చనిపోతే.. మరో కుక్కను తెచ్చుకుంటాం.. కానీ ఈ అమ్మాయి ఏకంగా ఏం చేసిందో చూడండి

ఆధునిక యుగంలో పెంపుడు జంతువులకు ఆదరణ పెరుగుతోంది. పెంపుడు జంతువులుగా ఎక్కువగా కుక్కలను పెంచుకుంటుంటారు. వాటిని కుక్కలా కాకుండా తమ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు. కొందరైతే వాటినే తోడుగా భావించి పెళ్లిళ్లు కూడా చేసుకోవడం లేదు. అవి చూపే ప్రేమ, అభిమానం అలా ఉంటాయి. మనుషుల్లో స్వార్థం ఎక్కువ ప్రేమ తక్కువగా ఉండటంతో చాలామంది పెంపుడు జంతువులనే తోడుగా భావించి సింగిల్ లైఫ్ నే లీడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. కాగా.. ఇంట్లో పెంచుకున్న వాటిని కోల్పోయినపుడు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. దుఃఖం, భరించలేని ఒంటరితనం అనుభవించాల్సిందే. కొన్నాళ్లకు మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటుంటారు. కానీ ఓ యువతి చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే.

గుజరాత్ లోని వడోదరాకు చెందిన గరిమా మాల్వాంకర్ ఫ్లూటో అనే కుక్కను పెంచుకుంటోంది. ఫ్లూటో ఆరోగ్యం ఉన్నట్లుండి అస్వస్థతకు గురైంది. దానిని కాపాడుకునేందుకు గరిమా ఎంత ప్రయత్నించినా, చికిత్స చేయించినా ఫలితం లేదు. ఆఖరికి ఫ్లూటో చనిపోయింది. పెంపుడు కుక్క చనిపోవడంతో గరిమా చాలా మూడిగా అయిపోయింది. ఫ్లూటోతో తనకున్న ప్రేమను మరో పెంపుడు జంతువుతో పంచుకోకూడదని భావించింది. ఫ్లూటో జ్ఞాపకాలను మరిచిపోయేందుకు దాని పుట్టినరోజున సాయాజీబాగ్ జూ కి వెళ్లింది. అక్కడ చిరుతపులిని చూసిన గరిమా దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది.

“ప్లూటో జూన్ 24న జన్మించింది. నా లాబ్రడార్‌కి దూరమయ్యాను. అది కుటుంబ సభ్యుడిలా ఉండేది. దానిని ఎప్పుడూ కట్టేసి ఉంచలేదు. ప్లూటో చనిపోయిన తర్వాత, దాని జ్ఞాపకార్థం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ప్లూటో పుట్టినరోజున మరో జంతువును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నా. సయాజీబాగ్ జూలో జంతువులను దత్తత తీసుకోవడం గురించి ఆరా తీశా. చివరకు చిరుతపులిని చూశా. కనీసం ఐదేళ్ల పాటు నా దత్తతలోనే ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నా”అని గరిమా తెలిపింది. ఈ విషయం తెలిసిన వారంతా షాకవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి