iDreamPost

Adipurush: అలా చేయడం తప్పేనన్న ఆదిపురుష్ టీమ్.. క్షమాపణలు చెబుతూ లేఖ!

Adipurush: అలా చేయడం తప్పేనన్న ఆదిపురుష్ టీమ్.. క్షమాపణలు చెబుతూ లేఖ!

గత కొన్నిరోజులుగా పాన్ ఇండియా లెవల్లో బాగా వినిపిస్తున్న పేరు ఆదిపురుష్. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు, ట్రోలింగ్ జరగడం చూస్తూనే ఉన్నాం. అయితే విడుదలకు ముందు రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై నెగిటివ్ కామెంట్స్ పోయి.. అంచనాలు పెరిగిపోయాయి. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై మిక్స్ డ్ టాక్ తో ముందుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా దూసుకుపోయినా కూడా.. సోషల్ మీడియా వేదికగా మాత్రం ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. క్యారెక్టర్ అప్పియరెన్స్ దగ్గరి నుంచి ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

అసలు ఇది రామాయణమే కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఆదిపురుష్ సినిమా కొత్త తలనొప్పి వచ్చిన విషయం తెలిసిందే. సీత భారత్ లో పుట్టిందంటూ చూపించడాన్ని నేపాల్ సెన్సార్ బోర్డు ఖండించింది. అలాగే నేపాల్ ప్రభుత్వం ఆదిపురుష్ సహా.. అన్ని బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిషేధించింది. ఈ విషయంపై ఆదిపురుష్ టీమ్ స్పందించింది. ఖాట్మాండు మేయర్, నేపాల్ సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ లేఖను రాసింది.

ఆ లేఖలో “ఏ విధంగా అయినా నేపాల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసుంటే మమ్మల్ని క్షమించండి. మిమల్ని బాధ పెట్టాలి అనేది మా ఆలోచన కాదు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటించిన శ్రీ రాఘవ్ పాత్ర చెప్పిన డైలాగ్ లో.. ఈరోజు నాకోసం కాదు.. భారత స్త్రీపై ఎవడైనా చేయి వేయాలనుకునే దుర్మార్గులు భయపడాలి. ఆ రోజు కోసం మీరు పోరాడండి. అనే డైలాగ్ లో సీతాదేవి పుట్టుకను సంబంధించింది కాదు. భారత స్త్రీని తాకాలంటే భయపడాలి అనే కోణంలో సాధారణంగా చెప్పిన డైలాగ్ అది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు, ముఖ్యంగా భారత స్త్రీల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఆ డైలాగ్ రాశాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల గౌరవం కూడా మాకు ముఖ్యమే. మీరు ఈ సినిమాని ఆ కోణంలోనే చూడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. మన చరిత్రపై మరింత ఆసక్తి కలిగేలా ఈ చిత్రాన్ని ఆదరించాలంటూ కోరుతున్నాం.” అంటూ టీసిరీస్- ఆదిపురుష్ టీమ్ లేఖను రాసింది. ఆదిపురుష్ టీమ్ నేపాల్ ప్రజలకు క్షమాపణలు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి