iDreamPost

అంబానీని వెనక్కు నెట్టిన అదానీ.. ఆసియాలో ఆయన అత్యంత కుబేరుడిగా అవతరణ

అంబానీని వెనక్కు నెట్టిన అదానీ..  ఆసియాలో ఆయన అత్యంత కుబేరుడిగా అవతరణ

దేశంలో అత్యంత సంపన్నుడిగా కొత్త వ్యక్తి తెరమీదకు వచ్చారు. దేశంలో ఇప్పటివరకు అత్యంత ధనవంతుడిగా ఉన్న ముకేశ్ అంబానీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అధిగమించారు. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం 100 బి. డాలర్ల సంపదతో భారత్ లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రపంచంలో టాప్-10 సంపన్నుల జాబితాలో అంబానీ 10 నుంచి 11వ స్థానానికి పడిపోగా, అదానీ 10వ స్థానం దక్కించుకున్నారు. ఆసియాలో ఆయన అత్యంత కుబేరుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అదానీ నికర విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 10వ స్థానంలో నిలిచారు.

బ్లూమ్‌బెర్గ్ యొక్క ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ $2.44 బిలియన్ల నెట్ వర్త్ తో 10వ స్థానానికి చేరుకున్నారు. అదే సమయంలో, అదానీ $ 100 బిలియన్ల నెట్ వర్త్ తో సెంటిబిలియనీర్స్ క్లబ్‌లో చేరారు. $100 బిలియన్ల కంటే ఎక్కువ నెట్ వర్త్ కలిగిన వ్యక్తులను సెంటిబిలియనీర్లు అంటారు. ఈ ఏడాది ఇప్పటివరకు అదానీ నికర విలువ 23.5 బిలియన్ డాలర్లు పెరిగింది. జాబితాలోని వ్యక్తులందరిలో అదానీ ఆస్తులు ఈ ఏడాది అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఏకంగా గత రెండేళ్లలో అదానీ గ్రూప్ షేర్లు 1000%కి పైగా పెరిగాయి.

బ్లూమ్‌బెర్గ్ సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆసియా సహా భారతదేశంలో రెండవ ధనవంతుడుగా ఉన్నారు. ఆయన మొత్తం నెట్ వర్త్ $99 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ ఏడాది ఇప్పటివరకు అంబానీ నెట్ వర్త్ 9.03 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ జాబితా ప్రకారం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్నారు. ఆయన నెట్ వర్త్ $273 బిలియన్లుగా అంచనా వేయబడింది. దీని తర్వాత అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన నెట్ వర్త్ విలువ 188 బిలియన్ డాలర్లు. ఫేస్‌బుక్‌ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ 85 బిలియన్ డాలర్లతో 12వ స్థానంలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి