iDreamPost

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న త్రిష.. టాలీవుడ్‌ అనగానే పెంచేస్తోందట!

ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందట.

ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందట.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న త్రిష.. టాలీవుడ్‌ అనగానే పెంచేస్తోందట!

తన నటన, అందచందాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు నటి త్రిష. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. సుమారు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తళ్లుక్కున మెరిసింది త్రిష. ఫిల్మ్ ఇండస్ట్రీలో త్రిష క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తుందట.

ఏ హీరోహీరోయిన్లకైనా వారు నటించిన సినిమాలు హిట్ అయితేనే అవకాశాలు క్యూ కడుతుంటాయి. దర్శక నిర్మాతలు వారి డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇక ఇదే అదనుగా భావించి పారితోషకాన్ని పెంచేస్తుంటారు యాక్టర్స్. వారికి ఉన్న క్రేజ్ ను బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు త్రిష కూడా ఇదే విధంగా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటుందట. కాగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రిష గట్టిగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్ త్రిష ఫుల్ ఫాంలో ఉంది. వరుస సినీ అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ఈ క్రమంలో త్రిష రెమ్యూనరేషన్ కు సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ లో కళ్లు చెదిరే పారితోషకాన్ని అందుకుంటుందట నటి త్రిష. అయితే టాలీవుడ్ విషయానికి వస్తే మాత్రం డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. దీంతో ఆమె అడిగినంత ఇచ్చుకోలేక దర్శక నిర్మాతలు పక్కన పెడుతున్నారట. మరి త్రిష కావాలనే డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందా.. అడిగినంత ఇవ్వాలని పెంచేస్తోందా అన్న విషయం తెలియాల్సి ఉంది. మరి త్రిష భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి