iDreamPost

Namitha: విడాకులు తీసుకోబోతున్న నమిత అంటూ వార్తలు.. అసలు విషయం ఇది!

Namitha: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఒకప్పటి హీరోయిన్, అందాల భామ నమిత కూడా భర్త నుంచి విడిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే..

Namitha: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఒకప్పటి హీరోయిన్, అందాల భామ నమిత కూడా భర్త నుంచి విడిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే..

Namitha: విడాకులు తీసుకోబోతున్న నమిత అంటూ వార్తలు.. అసలు విషయం ఇది!

నేటికాలంలో విడాకులు అనే అంశం చాలా కామన్ అయింది. అయితే ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో విడాకులకు సంబంధించిన వార్తలు వినిపిస్తుంటాయి. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా చాలా మంది సెలబ్రిటీలు విడిపోతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు,  పెళ్లై చాలా ఏళ్లు గడిచిన సెలబ్రిటీలు ఇలా చాలా మంది డైవర్స్ బాటలో వెళ్తున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని జంటలపై మాత్రం లేని వార్తలు షికారులు చేస్తున్నాయి. ఇక ఆ వార్తలను ఖండిచలేక పలువురు సెలబ్రిటీలు తలలు పట్టుకుంటే.. మరికొందరు కామెడీగా తీసుకుని నవ్వుకుంటారు. ఇంకొందరు మాత్రం స్పందిస్తుంటారు. అలానే తాజాగా హీరోయిన్ నమిత విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. ఈ ఇష్యూపై ఆమె స్పందిస్తూ..కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ వంటి వారు ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్, అందాల భామ నమిత కూడా భర్త నుంచి విడిపోనుందనే రూమర్స్ వస్తున్నాయి. వీటిపై ఈ అమ్మడు తాజాగా స్వయంగా ఆమెనే స్పందించింది. ‘సొంతం’ సినిమాతో నమిత తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించి.. ఆ తర్వాత కోలీవుడ్ లోకి వెళ్లి.. అక్కడే సెటిలైపోయింది. బాలయ్యతో సింహ సినిమా నటించి.. అందరిని ఆకట్టుకుంది.

2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. నమిత, వీరేంద్ర 2022లో కవల పిల్లలు పుట్టారు. వీరేంద్ర..నమితా కంటే చిన్నవాడు.ఇక నమిత ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ అవుతోంది. ఈ క్రమంలోనే తన భర్త నుంచి విడిపోయిందనే కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఆమె స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ..తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. ఈ మధ్యే తన భర్తతో కలిసి ఫొటోలు పోస్ట్ చేశానని, అయినప్పటికీ ఎలాంటి ఆధారాలతో తాము విడిపోయామని ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నటిగా తాను సినీ రంగంలో చాలా వదంతులు ఎదుర్కొన్నానని ఇప్పుడొచ్చిన దానితో తమ జంట ఏం బాధపడట్లేదని, అంతేకాక ఎంటర్ టైన్మెంట్ గా ఫీలై ఫుల్లుగా నవ్వుకున్నామని నమిత చెప్పుకొచ్చింది. మరి..నమిత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి