iDreamPost

పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్! వైరల్ అవుతున్న పోస్ట్!

  • Author ajaykrishna Published - 03:41 PM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 03:41 PM, Wed - 2 August 23
పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్! వైరల్ అవుతున్న పోస్ట్!

ఇండస్ట్రీలో బ్యాచిలర్ హీరోల పెళ్లిళ్ల విషయంలో ఎప్పటికప్పుడు రూమర్స్ బయటికి వస్తూనే ఉంటాయి. హీరోలు పెళ్లికి రెడీ అయ్యారంటే.. ఫ్యాన్స్ ఖుషి అవుతారు. ఒకవేళ వారు రెడీ లేకపోయినా పెళ్లి అని వార్తలు వచ్చాయంటే.. ఒకటి లైట్ తీసుకుంటారు లేదా కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. తాజాగా టాలీవుడ్ హీరో తరుణ్.. తన పెళ్లి అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇస్తూ.. ‘అవన్నీ నిజం కాదు పుకార్లు’ అని తేల్చి చెప్పేశాడు. అంతేగాక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మరీ తరుణ్ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. కొద్దిరోజులుగా తరుణ్ పెళ్లి అంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. ఆఖరికి హీరో తరుణ్ చెవిలో పడింది. ఇంకేముంది.. తనకు తెలియకుండా తన పెళ్లి గురించి వార్తలు ఏంటని తాజా పోస్ట్ తో క్లారిటీ ఇచ్చాడు. చాలకాలం తర్వాత తరుణ్ గురించి పెళ్లి అంటూ వార్తలు వినిపించేసరికి దాదాపు ఫ్యాన్స్, ఆడియన్స్ నిజమే అనుకున్నారు. కానీ.. ఎవరు ఎన్ని అనుకున్నా అసలు విషయం చెప్పాల్సింది తరుణ్ కాబట్టి.. తన పెళ్లి గురించి తానే చెబుతానని అన్నాడు. నటుడిగా తరుణ్ గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. బాలనటుడుగా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరో అయ్యాక లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ చేశాడు.

సడన్ గా ఏమైందోగానీ కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో తరుణ్ మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు మొదలైపోయాయి. కట్ చేస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి విషయం తేల్చేశాడు. “పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నిజంగా నేను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా సోషల్ మీడియాలో లేదా మీడియా ముఖంగా చెప్పేస్తాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో అస్సలు తెలియడం లేదు’ అని తరుణ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్క పోస్ట్ తో తరుణ్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tharun (@actortarun)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి